Stock market: 4 రోజుల నష్టాలకు బ్రేక్‌ - Stock markets Ended in red
close

Updated : 02/07/2021 15:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: 4 రోజుల నష్టాలకు బ్రేక్‌

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీల్లో నాలుగు రోజుల నష్టాల పరంపరకు శుక్రవారం బ్రేక్ పడింది. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమై ఆద్యంతం ఊగిసలాటలో పయనించిన సూచీలు ఇంధన, స్థిరాస్తి, టెలికాం, బ్యాంకింగ్‌ రంగాల నుంచి మద్దతు లభించడంతో చివర్లో పుంజుకున్నాయి. సెన్సెక్స్ చివరకు 166 పాయింట్ల లాభంతో 52,484 వద్ద.. నిఫ్టీ 42 పాయింట్లు లాభపడి 15,722 వద్ద స్థిరపడ్డాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.77 వద్ద నిలిచింది.

బీఎస్‌ఈ 30 సూచీలో రిలయన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఎం అండ్‌ ఎం, హెచ్‌యూఎల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఇన్ఫోసిస్‌ లాభాల్లో ముగియగా.. టాటా స్టీల్‌, పవర్‌ గ్రిడ్‌, ఏషియన్ పెయింట్స్‌, టీసీఎస్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ షేర్లు నష్టాలు చవిచూశాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని