Stock market: ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్‌ సూచీలు - Stock markets opened on flat note
close

Updated : 25/10/2021 09:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్‌ సూచీలు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. గతవారపు అమ్మకాల పరంపర ఈ వారమూ కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవలి బుల్‌ రన్‌లో కొత్త గరిష్ఠాలకు చేరిన కీలక కంపెనీల షేర్లు.. స్థిరీకరణ దిశగా సాగే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా కదలాడుతున్నాయి. ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్‌ 60 పాయింట్లు నష్టపోయి 60,761 వద్ద.. నిఫ్టీ 36 పాయింట్లు కోల్పోయి 18,073 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.91 వద్ద కొనసాగుతోంది.

సెన్సెక్స్‌ 30 సూచీలో.. ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, ఎస్‌బీఐ, ఎల్‌అండ్‌టీ, ఎన్‌టీపీసీ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఏషియన్‌ పెయింట్స్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఇండస్ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఆటో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, మారుతీ, టైటన్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని