రెండున్నర టెలికాం సంస్థలే మిగిలాయ్‌ - Telecom market now down to nearly two and half players as one operator increasingly becoming a question mark Sunil Mittal
close

Updated : 16/04/2021 08:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రెండున్నర టెలికాం సంస్థలే మిగిలాయ్‌

భారతీ ఎయిర్‌టెల్‌ ఛైర్మన్‌ సునీల్‌ మిత్తల్‌

దిల్లీ: దేశంలో 130 కోట్ల మంది జనాభాకు టెలికాం రంగంలో రెండున్నర ప్రైవేటు సంస్థలు మాత్రమే మిగిలాయనే అభిప్రాయాన్ని భారతీ ఎయిర్‌టెల్‌ ఛైర్మన్‌ సునీల్‌ మిత్తల్‌ వ్యక్తం చేశారు. ఎయిర్‌టెల్‌ ప్రయాణంలో 3-4 భారీ సంక్షోభాలను చవిచూసిందని, 2016లో జియో రూపంలో తీవ్ర అవాంతరాలు ఎదుర్కొందని.. వీటన్నింటిని తట్టుకుని మంచి స్థితిలో నిలిచిందని అన్నారు. వచ్చే 5-10 ఏళ్లలో ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్‌ నిలుస్తుందని, పారిశ్రామిక, డిజిటల్‌ మార్పులతో విజయాలు సాధిస్తుందని అన్నారు. అమెజాన్‌ సంభవ్‌ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ‘2016లో జియో రూపంలో అతిపెద్ద శక్తిమంతుదారు విపణిలోకి దూసుకొచ్చింది. ఏడాది పాటు ఉచిత సేవలు, మరో ఏడాది రాయితీలు, తక్కువ ధరలు, సబ్సిడీకే ఫోన్లు వంటివి ఆ సంస్థ ఇవ్వడంతో, 9 నుంచి 12 సంస్థలు విపణి నుంచి మాయమయ్యాయి. కొన్ని దివాలా తీయగా, మరి కొన్ని విలీనమయ్యాయి. వీటన్నింటినీ ఎయిర్‌టెల్‌ ఎదుర్కొంది. ఇప్పుడు ప్రైవేటు రంగంలో 3 సంస్థలున్నా, ఒక సంస్థ పరిస్థితి ప్రశ్నార్థకంగా ఉంటోంది. ఒకరకంగా రెండున్నర టెలికాం సంస్థలే ఉన్నట్లు’ అని మిత్తల్‌ వివరించారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని