టెక్‌ పక్షి తెచ్చిన తొలి సందేశానికి రూ.21 కోట్లు - Twitter CEO Jack Dorsey sells first tweet
close

Published : 23/03/2021 13:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టెక్‌ పక్షి తెచ్చిన తొలి సందేశానికి రూ.21 కోట్లు

శాన్‌ఫ్రాన్సిస్కో: నిత్యం ఉరుకులు పరుగులతో తీరిక లేని జీవితం గడుపుతున్న మనుషులను ట్విటర్‌ రూపంలో వచ్చిన టెక్‌ పక్షి పలకరించి ఈ నెల 21తో సరిగ్గా 15 ఏళ్లు గడించింది. ‘‘జస్ట్‌ సెట్టింగ్‌ అప్‌ మై ట్విటర్‌’’ అంటూ తన తొలి సందేశంతో జాక్‌ డోర్సీ తీసుకొచ్చిన సమాచార విప్లవాన్ని ట్విటర్‌ మనందరికీ పరిచయం చేసింది. సంస్థ సహ వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సీ మార్చి 21, 2006లో ఆ ట్వీట్‌ చేశారు.

ఇప్పుడు అందరి జీవితాల్లో భాగమైన ట్విటర్‌లో తొలి ట్వీట్‌ అంటే ప్రత్యేకమేగా మరి. అందుకే దీన్ని జాక్‌ డోర్సీ ‘వాల్యుయబుల్స్‌ బై సెంట్‌’ వెబ్‌సైట్‌లో అమ్మకానికి పెట్టారు. లక్షల మంది ట్వీట్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి వ్యక్తం చేస్తూ బిడ్లు దాఖలు చేశారు. చివరకు 2.9 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.21 కోట్లు) ఇచ్చి బ్రిడ్జ్‌ ఒరాకిల్‌ సంస్థ సీఈఓ సీనా ఎస్టావీ దాన్ని సొంతం చేసుకున్నారు.

ఈ ట్వీట్‌ను కొనుగోలు చేసిన వారికి ట్విటర్‌ సీఈవో డిజిటల్‌గా వెరిఫై చేసి, సంతకం చేసిన ఓ ధ్రువపత్రాన్ని అందజేస్తారు. ఆ పత్రంలో ట్వీట్‌తో పాటు అది పోస్ట్‌ చేసిన సమయం వంటి వివరాలు ఉంటాయి. దీంట్లో వచ్చిన మొత్తాన్ని బిట్‌కాయిన్‌ రూపంలోకి మార్చి ‘గివ్‌ డైరెక్ట్లీస్‌ ఆఫ్రికా రెస్పాన్స్‌’ అనే స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇస్తానని డోర్సీ తెలిపారు. ఈ సంస్థ ఆఫ్రికాలో కరోనా వైరస్‌ కారణంగా ఛిన్నాభిన్నమైన కుటుంబాలకు ఆర్థికగంగా అండగా నిలుస్తోంది.

ఇవీ చదవండి...

తయారీ రంగం కోలుకుంటోంది

5 లక్షల కోట్ల డాలర్ల జీడీపీ లక్ష్యం మూడేళ్లు వెనక్కి


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని