ఫండ్ల‌ ఎంపిక ఎలా చేస్తున్నారు? - What-to-consider-while-selecting-funds
close

Published : 19/08/2021 14:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫండ్ల‌ ఎంపిక ఎలా చేస్తున్నారు?

మంచి కార్పొరేట్ విధానం, వ్యాపారంలో నాణ్య‌త‌, వ్యాపార ప‌నితీరు, సంస్థ విలువ వంటి అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని పెట్టుబ‌డులు పెట్టాల‌ని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.  కార్పొరేట్ విధానం బాగాలేని సంస్థలను, వ్యాపారాన్ని పెంచే సామర్థ్యం లేదా ఉద్దేశ్యం లేని  సంస్థలను  పూర్తిగా నిషేదించాల‌ని తెలిపారు.
మేము సముచిత వ్యాపారాలు,  రుణ‌ రహిత బ్యాలెన్స్ షీట్లను చూస్తాము. స్మాల్‌ క్యాప్స్ విభాగంలో ఫండ్ విలువ అనేది చివ‌రి ప్రాధాన్య‌త క‌లిగింది. పైన చెప్పిన మిగ‌తా అంశాల‌ను ముఖ్యంగా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని చెప్తున్నారు.  స్టాక్‌లను త‌గిన‌ ధరకు కొనడానికి ప్రయత్నిస్తాము, దీంతో పాటు వాటిని దీర్ఘకాలికంగా ఉంచుతామని చెప్పారు.   స్మాల్ క్యాప్ ఫండ్ ఎదుర్కొనే లిక్విడిటీ రిస్క్‌ను నిర్వహించడానికి  మాకు స్టాక్ కేటాయింపు ప‌రిమితి ఉంద‌ని ఫండ్ మేనేజ‌ర్లు చెప్తున్నారు.
మ‌దుప‌ర్లు ఏం చేయాలి?
ఒక సంవత్సరం ట్రాక్ రికార్డ్ ద్వారా చూస్తే, ఫండ్ పనితీరు ఆకట్టుకుంటుంది, కాని ఈక్విటీలు పెట్టుబడుల దీర్ఘకాలిక ల‌క్ష్యాల కోసం  అనే వాస్తవాన్ని పెట్టుబడిదారులు గుర్తుంచుకోవాలి.  అందువల్ల పెట్టుబడిదారులు ఒక సంవత్సరం పనితీరు ఆధారంగా మాత్రమే ఈక్విటీ ఫండ్లను ఎంచుకోకూడ‌దు. మీరు భవిష్యత్తులో చాలా సంవత్సరాలు పెట్టుబడి పెట్టాల‌నుకున్న‌ప్పుడు, గతంలో చాలా సంవత్సరాల రాబడిని చూడటం చాలా ముఖ్యం.  ఫండ్ ఎంచుకునేందుకు   కనీసం ఐదేళ్ల ప‌నితీరును విశ్లేషించండి. అలాగే, పెట్టుబడులు పెట్టడానికి ఫండ్ల‌ను ఎన్నుకునేటప్పుడు రాబడి మాత్రమే ప్రమాణంగా ఉండకూడదు.  ఫండ్ పోర్ట్‌ఫోలియోను కూడా నిపుణులు చూడాలి.
 ఒక పెట్టుబడిదారుడు ఫండ్‌లో పెట్టుబడులు పెట్టాల‌నుకుంటే.. కేవ‌లం రాబడిని చూడకూడదు, ఫండ్ పోర్ట్‌ఫోలియోను కూడా చూడాలి.  పెట్టుబడిదారుల పోర్ట్‌ఫోలియోలో  చిన్న క్యాప్ ఫండ్‌ ఎంచుకోవాల‌నుకుంటే, రిస్క‌ను సమతుల్యం చేయడానికి తక్కువ విలువలతో మరో ఫండ్‌ను జోడించడం మంచిదని చెప్తున్నారు.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని