Zomato Ipo: జొమాటో లిస్టింగ్‌ నేడే.. 4 రోజులు ముందుగానే - Zomato Shares To Debut On The Bourses Tomorrow
close

Updated : 23/07/2021 01:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Zomato Ipo: జొమాటో లిస్టింగ్‌ నేడే.. 4 రోజులు ముందుగానే

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ జొమాటో నేడే మార్కెట్లలో లిస్టింగ్‌ కానుంది. వాస్తవానికి ఈ నెల 27న మార్కెట్‌లో లిస్ట్‌ అవ్వాల్సి ఉండగా.. నాలుగు రోజులు ముందుగానే (జులై 23న) లిస్టింగ్‌ అవుతున్నట్లు ఆ కంపెనీ ప్రతినిధి ఒకరు ధ్రువీకరించారు. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ రెండింట్లోనూ జొమాటో లిస్టింగ్‌ కానుంది. షేర్‌ ధరను కంపెనీ రూ.76గా నిర్ణయించింది.

మొత్తం రూ.9,375 కోట్లు సమీకరణే లక్ష్యంగా జొమాటో ఐపీవోకు రాగా... ఊహించని రీతిలో స్పందన లభించింది. 38.25 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయ్యింది. క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయ్యర్ల నుంచి 51.79 రెట్లు సబ్‌స్క్రైబ్‌ అవ్వగా.. నాన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్ల నుంచి 32.96 సబ్‌స్క్రైబ్‌ అయ్యింది. రిటైల్‌ విభాగంలో 7.45 రెట్లు సబ్‌స్క్రైబ్‌ అయ్యింది. ఇప్పటికే రూ.4,196.51 కోట్లను యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి జొమాటో సమీకరించింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని