stock market: ఊగిసలాట ధోరణిలో మార్కెట్‌ సూచీలు - bse Sensex volatile
close

Updated : 25/11/2021 09:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

stock market: ఊగిసలాట ధోరణిలో మార్కెట్‌ సూచీలు

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ మార్కెట్‌ సూచీలు గురువారం ఊగిసలాట ధోరణిలో ట్రేడింగ్‌ ప్రారంభించాయి. ఉదయం నష్టాలతో మొదలైన సూచీలు మెల్లగా లాభాల్లోకి వచ్చాయి. ఉదయం 9.25 గంటల సమయానికి సెన్సెక్స్‌ 23 పాయింట్ల లాభంతో 58,364 వద్ద, నిఫ్టీ 17 పాయింట్ల లాభంతో 17,432 వద్ద కొనసాగుతున్నాయి. సస్కెన్‌ టెక్నాలజీస్‌, బోరోసిల్‌ రెనీవబుల్‌, యారీ డిజిటల్‌, ట్రైడెంట్‌ లిమిటెడ్‌, మహీంద్రా లాజిస్టిక్స్‌ షేర్లు లాభాల్లో ఉండగా.. సీమన్స్‌ లిమిటెడ్‌, న్యూక్లియస్‌ సాఫ్ట్‌వేర్‌, నికాన్‌, ఎల్గీ ఎక్విప్‌మెంట్స్‌, సీక్వెంట్‌ సైంట్‌ఫిక్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. 

నిన్న అమెరికాలోని ఎస్‌అండ్‌పీ500 సూచీ 0.2శాతం,నాస్‌డాక్‌ సూచీ 0.4శాతం లాభపడగా.. డోజోన్స్‌ ఫ్లాట్‌గా ముగిసింది. నేటి ట్రేడింగ్‌లో బీఎస్‌ఈ క్యాపిటల్‌ గూడ్స్‌ సూచీ అత్యధికంగా లాభపడగా.. బ్యాంకింగ్‌ రంగ సూచీ అత్యధికంగా నష్టపోయింది. డాలర్‌తో పోలిస్తే రూపాయ విలువ 0.08 పైసలు నష్టపోయి రూ.74.39గా కొనసాగుతోంది. 


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని