మైక్రోసాఫ్ట్‌ టెక్నాలజీస్‌@2021 - five microsoft technologies to watch in 2021
close

Published : 31/12/2020 22:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మైక్రోసాఫ్ట్‌ టెక్నాలజీస్‌@2021

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం తల్లకిందులైపోయింది. సాంకేతికత మన రోజువారీ జీవనంలో భాగమైపోయింది. ప్రపంచం ఎప్పటికప్పుడు నూతన సాంకేతికతను అందుకుంటూ దూసుకుపోతోంది. ఈ అంశంలో ఎల్లప్పుడూ ముందుండే మైక్రోసాఫ్ట్‌ కొత్త ఏడాదిలో ఏఏ సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేయనుందో చూద్దాం. 
మెటా ఓఎస్‌..
మైక్రోసాఫ్ట్ 365 క్లౌడ్‌ స్పేస్‌లో ఒక లేయర్‌గా అభివృద్ధి చెందుతున్న ఈ ‘మెటా ఓఎస్‌’ను ‘టావోస్‌’ అని కూడా అంటారు. మెటా ఓఎస్‌ అనేది ఒక మొబైల్‌ ప్లాట్‌ఫాం. డివైజ్‌ పనితీరు దీనిపైనే ఆధారపడి ఉంటుంది. ఇది మైక్రోసాఫ్ట్‌ ఓఎస్‌ లాగ ఉండదు కానీ అప్లికేషన్‌ మోడల్‌లో పనిచేస్తుంది. 2021లో సింగిల్‌ టాస్క్‌ యాప్స్‌ను మనం మైక్రోసాఫ్ట్‌ నుంచి పొందే అవకాశముంది. 
యూనివర్సల్‌ సెర్చ్‌..
మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ ఎప్పడూ ‘వినియోగదారులు సమాచారాన్ని వెతుక్కోకూడదు. సమాచారమే వారి వద్దకు వచ్చేలా ఉండాలి’ అని ఆకాంక్షించేవారు. 1990లో ఆయన తయారు చేసిన ‘కామ్‌డెక్స్‌’కు కూడా ఆయన ‘ఇన్ఫర్మేషన్‌ ఎట్‌ యువర్‌ ఫింగర్‌టిప్స్‌’ అని పేరు పెట్టారు. ఆయన ఆలోచనను నిజం చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానంతో మైక్రోసాఫ్ట్‌ ముందడుగు వేస్తోంది. 2018 నుంచి 2020 వరకూ మైక్రోసాఫ్ టీమ్స్‌ విండోస్‌, ఎడ్జ్‌ వంటి ఆఫీస్‌ యాప్స్‌లో సెర్చింగ్‌కు ఉపయోగిస్తున్నారు. మైక్రోసాఫ్ట్‌ సెర్చ్‌ అనేది ఇంట్రానెట్‌ సెర్చింగ్‌కు ఉపకరిస్తుంది. ఇది బింగ్‌తో అనుసంధానమై ఉంటుంది. 2021లో యూనిఫైడ్‌ సెర్చింజన్‌లో అందుబాటులోకి తెచ్చేందుకు మైక్రోసాఫ్ట్‌ ప్రయత్నిస్తోంది. 
ఇంటిలిజెంట్‌ ఎడ్జ్‌..
సాధారణంగా కంప్యూటర్లను, సర్వర్లను ఇంటిలిజెంట్‌ ఎడ్జ్‌ డివైజ్‌లుగా పరిగణిస్తారు. అవికాకుండా ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ పరికరాలను ఎడ్జ్‌ డివైజ్‌లు అభివర్ణిస్తారు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌ పరికరాల సంఖ్యను పెంచుతోంది. ఆన్‌బోర్డ్‌ ఏఐ సామర్థ్యంతో ఉన్న ఏ పరికరాన్నైనా ఎడ్జ్‌గా పరిగణించాలి. ఇటీవల మైక్రోసాఫ్ట్‌ ప్రకటించిన అజూర్‌ డేటాసెంటర్లు ఇంటర్నెట్‌ లేకుండా పనిచేయగలవు. అంతేకాకుండా 2021లో మైక్రోసాఫ్ట్‌ ‘ఫిజి’ని ప్రవేశపెట్టనుంది. ఇది లోకల్‌ క్లౌడ్‌గా వినియోగదారులకు ఉపయోగపడుతుంది. ఇది ఇంటిలిజెంట్‌ ఎడ్జ్‌కు సరైన ఉదాహరణ.
క్లౌడ్‌ పీసీ..
2021లో మైక్రోసాఫ్ట్‌ క్లౌడ్‌ పీసీ డెస్క్‌టాప్‌ సర్వీస్‌ ఆఫర్‌గా డెస్క్‌టాప్‌ వర్చువలైజేషన్‌ను ప్రకటించనుంది. మైక్రోసాఫ్ట్‌ కంప్యూటర్లు ఉన్న వినియోగదారులకు ఈ క్లౌడ్‌ పీసీ ఒక మంచి ఎంపిక. 
విండోస్‌ 10 ఎక్స్‌..
మైక్రోసాఫ్ట్‌కున్న గత వైభవాన్ని మళ్లీ తిరిగి తెచ్చేందుకు సంస్థలోని ఒక కొత్త బృందం ప్రయత్నిస్తోంది. కొత్త విండోస్‌ వేరియంట్‌ సులువుగా పనిచేస్తూ వేగవంతమైన పనితీరును కనబరుస్తుంది. అసలు 2021లో మైక్రోసాఫ్ట్‌ 10 ఎక్స్‌ డ్యుయల్ స్క్రీన్‌, ఫోల్డబుల్‌ విండోస్‌ను అందుబాటులోకి తేవాలనుకుంది. కానీ కరోనా కారణంగా 10ఎక్స్‌ను కొత్త సింగిల్‌ స్క్రీన్‌ డివైజ్‌లలో ప్రవేశపెట్టనుంది.

ఇవీ చదవండి..

2020 నేర్పిన ఆర్థిక పాఠాలు

వైరల్‌ వీడియోస్‌ 2020


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని