ఫ్రెష్‌వర్క్స్‌ షేర్లపై భారతీయ మదుపర్ల ఆసక్తి
close

Published : 27/09/2021 01:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫ్రెష్‌వర్క్స్‌ షేర్లపై భారతీయ మదుపర్ల ఆసక్తి

దిల్లీ: సాఫ్ట్‌వేర్‌ సేవల సంస్థ ఫ్రెష్‌వర్క్స్‌ షేర్లలో పెట్టుబడి పెట్టేందుకు భారతీయ మదుపర్లు అమితాసక్తి ప్రదర్శిస్తున్నట్లు బ్రోకర్లు చెబుతున్నారు. అమెరికా మార్కెట్‌లో నమోదైన సంస్థల్లో పెట్టుబడులు పెట్టేందుకు సహకరించే బ్రోకర్లలో ఒకటైన వెస్టెడ్‌ ఫైనాన్స్‌ వద్ద లభ్యమవుతున్న సమాచారం మేరకు, మదుపర్లు పెట్టుబడి పెట్టేందుకు ఎంపిక చేసుకుంటున్న షేర్లలో ఫ్రెష్‌వర్క్స్‌ ముందుంది. ఇంతవరకూ మైక్రోసాఫ్ట్‌ షేర్లపై ఆసక్తి కనబరిచిన భారతీయులు ఇప్పుడు ఫ్రెష్‌వర్క్స్‌ వైపు చూస్తున్నారని తెలుస్తోంది. గత 6 నెలలుగా టెస్లా కంపెనీకి ఆదరణ తగ్గడంతో ఈ కౌంటర్‌లో మదుపర్ల హోల్డింగ్‌ 10 నుంచి 7.8 శాతానికి తగ్గింది. గత 30 రోజుల నుంచి చూస్తే, భారతీయ మదుపర్లు మైక్రోసాఫ్ట్‌, యాపిల్‌, అమెజాన్‌, సేల్స్‌ఫోర్స్‌, ఫేస్‌బుక్‌, జూమ్‌ వీడియో కంపెనీ షేర్లను అధికంగా కొనుగోలు చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని