మూడు వేల మంది విద్యార్థులకు నైపుణ్య శిక్షణ
close

Published : 29/09/2021 01:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మూడు వేల మంది విద్యార్థులకు నైపుణ్య శిక్షణ

 టెక్‌ మహీంద్రాతో కెరీర్‌ ల్యాబ్స్‌ ఒప్పందం

ఈనాడు, హైదరాబాద్‌: ఐటీ పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలలో శిక్షణ ఇచ్చేందుకు ఎడ్యుటెక్‌ సంస్థ కెరీర్‌ ల్యాబ్స్‌, టెక్‌ మహీంద్రాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా దాదాపు మూడు వేల మందికి పైగా గ్రాడ్యుయేట్లకు ఆధునిక సాంకేతికతలపై శిక్షణ ఇస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసిన వారికి టెక్‌ మహీంద్రాలో వివిధ విభాగాల్లో ఉద్యోగాలు పొందే అవకాశమూ లభిస్తుందని టెక్‌ మహీంద్రా డీఅండ్‌ఐ హెడ్‌ వైశాలీ పాఠక్‌ అన్నారు. గత ఏడాదితో పోలిస్తే.. ఐటీ రంగంలో నియామకాలు 200శాతం పెరిగినప్పటికీ.. పరిశ్రమ అవసరాలకు తగిన నిపుణుల కొరత ఉంది. దీన్ని భర్తీ చేసేందుకు


టాటా అల్ట్రోజ్‌ లక్ష కార్ల అమ్మకం

ముంబయి: పుణె తయారీ ప్లాంట్‌లో హ్యాచ్‌బ్యాక్‌ మోడల్‌ అల్ట్రోజ్‌ 1,00,000వ కారును ఉత్పత్తి చేసినట్లు టాటా మోటార్స్‌ ప్రకటించింది. 2019 నవంబరులో కంపెనీ అల్ట్రోజ్‌ ఉత్పత్తిని ప్రారంభించింది. 2020 జనవరిలో విపణిలోకి విడుదల చేసింది. ఆల్ఫా (అగైల్‌ లైట్‌ ఫ్లెక్సిబుల్‌ అడ్వాన్స్‌డ్‌) ఆకృతిపై నిర్మించిన మొదటి మోడల్‌ ఇదే కావడం విశేషం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ విభాగంలో 20 శాతానికి పైగా వాటాతో అల్ట్రోజ్‌ 2వ స్థానంలో ఉందని, నెలకు దాదాపు 6000 కార్లను విక్రయిస్తున్నట్లు టాటా మోటార్స్‌ వెల్లడించింది. ఈ ఏడాది మార్చిలో గరిష్ఠంగా 7,550 అల్ట్రోజ్‌ కార్లను కంపెనీ విక్రయించింది. ‘అల్ట్రోజ్‌ లక్ష కార్ల మైలురాయిని అధిగమించింది. కఠిన సమయంలో వినియోగదారులు, భాగస్వాముల తోడ్పాటుకు ధన్యవాదాలు. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ విభాగంలో అల్ట్రోజ్‌ వినియోగదారులకు అద్భుత ఫీచర్లను అందిస్తోంది’ అని టాటా మోటార్స్‌ ఉపాధ్యక్షుడు (అమ్మకాలు- ప్రయాణికుల వాహన విభాగం) రాజన్‌ అంబ పేర్కొన్నారు. దిగ్గజ కంపెనీతో కలిసి శిక్షణ ఇస్తున్నట్లు కెరీర్‌ ల్యాబ్స్‌ సీఈఓ పీఎన్‌ సంతోశ్‌ తెలిపారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని