పసుపు ముందుకే!
close

Published : 18/10/2021 02:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పసుపు ముందుకే!

కమొడిటీస్‌
ఈ వారం
బంగారం

సిడి డిసెంబరు కాంట్రాక్టు ఈవారం కిందకు వస్తే రూ.46,685 వద్ద మద్దతు లభించే అవకాశం ఉంది. ఒకవేళ ఈ స్థాయినీ కోల్పోతే రూ.46,156కి పడిపోవచ్చు. అందువల్ల రూ.46,421 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకుని రూ.47,657; రూ.47,921 లక్ష్యాలతో రూ.46,685 సమీపంలో లాంగ్‌ పొజిషన్లు తీసుకోవచ్చు. రూ.46,685 కంటే కిందకు రానంత వరకు ధర తగ్గినప్పుడల్లా కొనుగోళ్లకు మొగ్గు చూపొచ్చు. సాంకేతిక అంశాలతో పాటు అమెరికా విడుదల చేసే కీలక ఆర్థిక గణాంకాలు, ఇతర అంతర్జాతీయ పరిణామాలపైనా ట్రేడర్లు దృష్టి సారించడం మంచిది.

* ఎంసీఎక్స్‌ బుల్‌డెక్స్‌ అక్టోబరు కాంట్రాక్టు రూ.13,864 కంటే దిగువకు రాకుంటే రూ.14,256; రూ.14,352 వరకు పెరిగే అవకాశం ఉంటుంది.


వెండి

* వెండి డిసెంబరు కాంట్రాక్టు రూ.62,225 కంటే దిగువకు వస్తే రూ.61,692; రూ.60,918 స్థాయిలకు పడిపోయే అవకాశం ఉంది. ఒకవేళ రూ.65,373 స్థాయిని అధిగమిస్తే రూ.66,146 వరకు పెరుగుతుందని భావించవచ్చు.


ప్రాథమిక లోహాలు

* ఎంసీఎక్స్‌ మెటల్‌డెక్స్‌ అక్టోబరు కాంట్రాక్టు రూ.18,837 కంటే ఎగువన కదలాడకుంటే.. కొంత దిద్దుబాటుకు ఆస్కారం ఉంటుంది.

* రాగి అక్టోబరు కాంట్రాక్టుకు రూ.762 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకుని, ప్రస్తుత లాంగ్‌ పొజిషన్లు కొనసాగించవచ్చు.

* సీసం అక్టోబరు కాంట్రాక్టు రూ.197 కంటే పైన కదలాడకుంటే కిందకు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఈ స్థాయి ఎగువన చలిస్తే మరింతగా రాణిస్తుందని భావించవచ్చు.

* జింక్‌ అక్టోబరు కాంట్రాక్టు రూ.283.30 కంటే దిగువన ట్రేడయితే మరింతగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది.  

* అల్యూమినియం అక్టోబరు కాంట్రాక్టు రూ.262.35 కంటే ఎగువన కదలాడకుంటే, షార్ట్‌ సెల్‌ పొజిషన్లను కొనసాగించవచ్చు.

* నికెల్‌ అక్టోబరు కాంట్రాక్టు రూ.1,500 కంటే దిగువన ట్రేడ్‌ కాకుంటే.. రూ.1,555 వరకు పెరిగే అవకాశం ఉంది.


ఇంధన రంగం

* ముడి చమురు నవంబరు కాంట్రాక్టు రూ.6,054 కంటే దిగువన ట్రేడయితే రూ.5,948;  రూ.5,880 వరకు దిద్దుబాటు కావచ్చు. ఒకవేళ రూ.6,161 కంటే పైన కదలాడితే మరింతగా రాణిస్తుందని భావించవచ్చు.

* ముడి పామోలిన్‌ నూనె (సీపీఓ) అక్టోబరు కాంట్రాక్టుకు రూ.1,091 దిగువన షార్ట్‌ సెల్‌ పొజిషన్లు కొనసాగించవచ్చు.

* సహజవాయువు అక్టోబరు కాంట్రాక్టు రూ.441 కంటే ఎగువన కదలాడకుంటే.. మరింతగా దిద్దుబాటు కావచ్చు.


వ్యవసాయ ఉత్పత్తులు

* పసుపు నవంబరు కాంట్రాక్టు గత మూడు వారాల ర్యాలీని కొనసాగించే అవకాశం ఉంది. రూ.7,381; రూ.7,452 వరకు పెరుగుతుందని భావించవచ్చు. అయితే రూ.7,224 కంటే దిగువన కదలాడితే మాత్రం రూ.7,138 వరకు పడిపోవచ్చు.

* జీలకర్ర నవంబరు కాంట్రాక్టు రూ.14,287 కంటే కిందకు వస్తే మరింతగా దిద్దుబాటు కావచ్చు. ఒకవేళ ఈ స్థాయికి పైన కదలాడితే.. ధర తగ్గినప్పుడల్లా కొనుగోలు చేసే వ్యూహంతో ముందుకెళ్లొచ్చు.

* సోయాబీన్‌ నవంబరు కాంట్రాక్టు రూ.5,030 కంటే దిగువకు రాకుంటే రూ.5,434 లక్ష్యంతో లాంగ్‌ పొజిషన్ల వైపు మొగ్గు చూపొచ్చు.

- ఆర్‌ఎల్‌పీ కమొడిటీ అండ్‌ డెరివేటివ్స్‌


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని