టీవీఎస్‌.. ప్రత్యేక విద్యుత్తు వాహన కంపెనీ
close

Updated : 22/10/2021 06:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టీవీఎస్‌.. ప్రత్యేక విద్యుత్తు వాహన కంపెనీ

దిల్లీ: టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ విద్యుత్తు వాహనాల కోసం ప్రత్యేక అనుబంధ కంపెనీని నెలకొల్పనుంది. ఇప్పటికే ఈ విభాగం కోసం 500 మంది ఇంజినీర్లను కేటాయించింది కూడా. ఇ-బైక్‌లు, ఇ-స్కూటర్లు, ఇ-కార్గో బైక్‌లను సంస్థ విడుదల చేయనుంది. సెప్టెంబరు త్రైమాసికంలో టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ ఏకీకృత ప్రాతిపదిక రూ.234.37 కోట్ల నికర లాభాన్ని నమోదుచేసింది. 2020-21 ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.181.41 కోట్లతో పోలిస్తే ఇది 29.19 శాతం ఎక్కువ. ఇదే సమయంలో మొత్తం కార్యకలాపాల ఆదాయం రూ.5,254.36 కోట్ల నుంచి రూ.6,483.42 కోట్లకు చేరింది. ద్విచక్ర వాహన మొత్తం విక్రయాలు 8.34 లక్షల నుంచి 8.7 లక్షలకు పెరగ్గా, ఎగుమతుల్లో 46 శాతం వృద్ధి లభించింది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని