close

Updated : 22/04/2021 17:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

5 ఏళ్ళ కోసం రిస్క్ లేని పధకాలు ఏవి?

Q. నా దగ్గర 5 లక్షల రూపాయలు ఉన్నాయి. మా పాప పెళ్లి కి ఇంకా 5 ఏళ్ళ సమయం ఉంది. నా డబ్బు కి రిస్క్ లేకుండా మంచి రాబడి వచ్చే పథకాలు ఏమైనా చెప్పండి.

- కిరణ్, హైదరాబాద్.

A. మీకు 5 ఏళ్ళ సమయం ఉందన్నారు కాబట్టి రిస్క్ లేని పథకాల్లో మదుపు చేయడమే మేలు. దీని కోసం మీరు బ్యాంకు ఫిక్సిడ్ డిపాజిట్ ఎంచుకోవచ్చు. మీ పెట్టుబడికి సెక్షన్ 80C ద్వారా (సెక్షన్ పూర్తి మినహాయింపు రూ. 1.50 లక్షలు) పన్ను మినహాయింపులు కూడా పొందొచ్చు. ప్రభుత్వం రూ. 5 లక్షల వరకు డిపాజిట్ల‌పై బీమా కూడా అందిస్తుంది, కాబట్టి మీరు ప్రైవేట్ బ్యాంకులను కూడా ఎంచుకోవచ్చు. ఆర్బీఎల్, యెస్ బ్యాంకు, ఇండస్ ఇండ్ లాంటి బ్యాంకులను పరిశీలించండి. వీటి వడ్డీ రేట్లు కాస్త అధికంగా ఉంటాయి. 

Q. నేను బ్యాంకు నుంచి ఇంటి రుణం తీసుకుని ఇల్లు కట్టుకున్నాను. ఇల్లు నా భార్య పేరు మీద ఉంది. ఆవిడ ప్రభుత్వ ఉద్యోగి. ఈ రుణానికి తను అప్లికెంట్ , నేను కో అప్లికెంట్ గా ఉన్నాము. ఇద్దరమూ కలిసి ఈఎంఐ కడుతున్నాము  కాబట్టి ఇంటి రుణం మీద పన్ను మినహాయింపు ఇద్దరూ పొందొచ్చా?

 - రవి కుమార్, హైదరాబాద్

A. మీరు తెలిపినట్టు గా మీ ఇద్దరూ కలిసి ఈఎంఐ చెల్లిస్తున్నప్పటికీ మీరు జాయింట్ ఓనర్ కానందున పన్ను మినహాయింపు పొందే వీలుండదు. ఇంటిని మీ పేరు మీద మార్చడం ద్వారా పన్ను మినహాయింపులు పొందొచ్చు. దీనికి మీరు గిఫ్ట్ డీడ్ పధ్ధతిని వాడటం మంచిది. ఈ పధ్ధతి ద్వారా ఇంటి బదిలీ పన్నులు ఉండవు. వివరాల కోసం మీరు న్యాయవాదిని లేదా ఛార్టర్డ్ అకౌంటెంట్ లాంటి పన్ను  నిపుణులని సంప్రదించడం మంచిది.

Q. డియర్ సిరీ! నేను ప్రస్తుతం క్రింద పేర్కొన్న ఫండ్స్ లో ప్రతినెలా రూ. 8000/- (ఒక్కో ఫండ్ లో రూ.1000/- చొప్పున) SIP చేస్తున్నాను. 1. Axis midcap fund 2. DSP world gold fund 3. Edelweiss Greater china equity offshore fund 4. ICICI Pru US bluechip equity fund 5. IDFC G-Sec fund constant maturity plan 6. IDFC Nifty fund 7. Mirae Asset emerging blue chip fund 8. Nippon india nifty smallcap 250 index fund ఈ పోర్ట్ ఫోలియో లో ఏమైనా మార్పులు చేర్పులు అవసరమైతే సూచించగలరు.

- తేజ, విజయవాడ

A. మీరు  వివిధ రకాల క్యాటగిరి లో ని 8 ఫండ్స్ లో మదుపు చేస్తున్నారు. అధిక ఫండ్స్ లో మదుపు చేయడం వల్ల ప్రత్యేకమైన లాభం ఉండదు. పైగా, వాటిని ట్రాక్ చేయడం కూడా కాస్త కష్టమైన విషయమే. మీరు IDFC Nifty ఫండ్, Axis మిడ్క్యాప్ ఫండ్ లో కొనసాగవచ్చు. ఈ ఫండ్స్ లో రూ. 4000 చొప్పున సిప్ చేయవచ్చు. కనీసం 10 ఏళ్ళ పాటు సిప్ చేస్తేనే రిస్క్ తగ్గి, మంచి రాబడి పొందే అవకాశం ఉంటుంది. 

నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.

Q. క్రెడిట్ స్కోర్ తెలుసుకోవడం ఎలా?

- దీపక్, వరంగల్.

A. క్రెడిట్ కార్డు తీసుకోవాలన్నా గృహ, వ్యక్తిగత రుణం కోసం దరఖాస్తు చేసుకున్నా బ్యాంకులు మన క్రెడిట్ స్కోర్నే  ప్రామాణికంగా చూస్తాయి. క్రెడిట్ స్కోర్ను క్రెడిట్ సమాచార కంపెనీలు జారీ చేస్తాయి. వ్యక్తులకు రుణం ఇవ్వాలంటే రుణ సంస్థలు క్రెడిట్ బ్యూరోలను ఆశ్రయిస్తున్నాయి. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు క్రెడిట్ బ్యూరోల వద్ద సభ్యత్వం పొంది వ్యక్తుల రుణ చరిత్రలను తెలుసుకుంటాయి. అలాగే వ్యక్తులు సైతం తమ రుణచరిత్ర నివేదికలను క్రెడిట్ బ్యూరోల‌ వద్ద పొందవచ్చు.  ప్రస్తుతం దేశంలో వ్యక్తుల క్రెడిట్ స్కోర్లను అందించే సంస్థలు సిబిల్, ఈక్విఫాక్స్, ఎక్స్పీరియన్, సీఆర్ఐఎఫ్ హైమార్క్. వీటిలో సిబిల్ ఎక్కువ ప్రాచుర్యం పొందింది.

 

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని