కారు రుణంపై వివిధ బ్యాంకులు అందించే వడ్డీ రేట్లు..
కొత్త కారును కొనుగోలు చేయాలన్నా లేదా పాత కారును అప్‌గ్రేడ్ చేయాలనుకున్నా లేదా కుటుంబానికి మరొక కారు కొనుగోలు చేయాలనుకున్నా కారణం ఏమైనప్పటికీ, రుణం తీసుకుని కారును సులభంగా కొనుగోలు చేయవచ్చు. సాధారణంగా బ్యాంకులు కారు రుణాలను మూడు నుంచి ఐదు సంవత్సరాల కాలపరిమితితో అందిస్తాయి, కానీ కొన్ని బ్యాంకులు మాత్రం ఏడు సంవత్సరాల కాలపరిమితతో రుణాలను ఆఫర్ చేస్తున్నాయి. ఎక్కువ కాలపరిమితితో రుణం తీసుకుంటే, నెలవారీగా చెల్లించాల్సిన ఈఎమ్ఐ మొత్తం తక్కువగా ఉంటుంది. ఇది కారు కొనుగోలును మరింత సులభతరం చేస్తుంది, కానీ ఎక్కువ మొత్తంలో వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, కారు తరుగుదల ఆస్తి, కాబట్టి ఇందు కోసం పెద్ద మొత్తంలో రుణం తీసుకోవడం తెలివైన నిర్ణయం కాకపోవచ్చు. ఒకవేళ మీరు స్వల్ప కాలపరిమితితో రుణం తీసుకున్నట్లైతే, పెద్ద మొత్తంలో ఈఎంఐని చెల్లించాల్సి ఉంటుంది. సరైన సమయానికి ఈఎమ్ఐ చెల్లించ లేకపోతే, అది మీ క్రెడిట్ రిపోర్టుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అలాగే రుణ మొత్తానికి కూడా షరతులు వర్తిస్తాయి. ఉదాహరణకు, కొన్ని బ్యాంకులు కారు పూర్తి ఎక్స్-షోరూమ్ ధరపై రుణాలను ఇస్తే, మరికొన్ని బ్యాంకులు కారు మొత్తం ధరలో 80 శాతం వరకు మాత్రమే రుణం ఇస్తున్నాయి. కారు రుణం తీసుకునేప్పుడు బ్యాంకులు ఆఫర్ చేస్తున్న వడ్డీ రేటు మాత్రమే కాకుండా, దానికి వర్తించే ప్రాసెసింగ్ ఫీజు, ఇతర ఛార్జీలను కూడా పరిశీలించడం మంచిది.
కారు రుణంపై వివిధ బ్యాంకులు అందించే వడ్డీ రేట్ల వివరాలను కింద చూద్దాం…
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. నా వద్ద జీవన్ సరళ్ పాలసీ ఉంది, 2010 నుంచి రూ. 30,025 ప్రీమియం చెల్లించాను. సరెండర్ చేస్తే ఎంత వస్తుంది?
-
Q. నా దగ్గర 5 లక్షల రూపాయలు ఉన్నాయి. మా పాప పెళ్లి కి ఇంకా 5 ఏళ్ళ సమయం ఉంది. నా డబ్బు కి రిస్క్ లేకుండ మంచి రాబడి వచ్చే పథకాలు ఏమైనా చెప్పండి.
-
Q. నేను బ్యాంకు నుంచి ఇంటి రుణం తీసుకుని ఇల్లు కట్టుకున్నాను. ఇల్లు మా భార్య పేరు మీద ఉంది. ఆవిడ ప్రభుత్వ ఉద్యోగి. ఈ రుణానికి తాను అప్లికెంట్ , నేను కో అప్లికెంట్‌గా ఉన్నాము. ఇద్దరమూ కలిసి ఈఎంఐ కడుతున్నాము కాబట్టి ఇంటి రుణం మీద పన్ను మినహాయింపు ఇద్దరూ పొందొచ్చా?