close
హైదరాబాద్‌లో ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ కార్యాలయం

ఈనాడు, హైదరాబాద్‌: భారత్‌లో విస్తరించే వ్యూహంతో ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ హైదరాబాద్‌లో మరో కార్యాలయాన్ని ప్రారంభించింది. రేటింగ్స్‌, అనలిటిక్స్‌, డేటా సేవలను అందిస్తోన్న ఈ సంస్థ తన కొత్త ఓరియన్‌ కార్యాలయంలో 750 మంది కొత్త ఉద్యోగులను తీసుకుంది. దీంతో ఇక్కడ ఉద్యోగుల సంఖ్య 4,500 మందికి చేరిందని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ ఇండియా ఆపరేషన్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అభిషేక్‌ తోమర్‌ తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఓరియన్‌ టెక్నాలజీ కేంద్రం అభివృద్ధి, నిర్వహణ అప్పగింత కోసం 2017లో నెస్‌ టెక్నాలజీతో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పుడు ఈ కేంద్రం పూర్తిస్థాయిలో ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ కిందకు బదిలీ అయ్యిందని పేర్కొన్నారు. ఈ కేంద్రం కోసం ఇప్పటి వరకూ దాదాపు 10మిలియన్‌ డాలర్ల మేరకు పెట్టుబడి పెట్టినట్లు వివరించారు. మరో 150 మంది ఉద్యోగులనూ తీసుకునేందుకు అవకాశం ఉందన్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.