Eenadu Online Edition Business News - EENADU
close
ఏడాదిలో 20 కొత్త పాఠశాలలు 

విస్తరణ దిశగా కంగారూ కిడ్స్‌

ఈనాడు, హైదరాబాద్‌: ప్రీమియం ప్లే స్కూళ్ల సంస్థ కంగారూ కిడ్స్‌ ఎడ్యుకేషన్‌ ఏడాదిలో 15-20 కొత్త పాఠశాలలను ఏర్పాటు చేసేందుకు సిద్ధపడుతోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 100 ప్లే స్కూళ్లు, 25 ఉన్నత పాఠశాలను ఈ సంస్థ ఫ్రాంఛైజీ విధానంలో ఏర్పాటు చేసింది. వీటిని 3-4 ఏళ్లలో 350 వరకూ చేయాలని లక్ష్యంగా విధించుకున్నట్లు ముఖ్య కార్యనిర్వహణాధికారి శేషసాయి కేవీస్‌ తెలిపారు. ఇవన్నీ ఫ్రాంఛైజీ విధానంలోనే ఉంటాయని, అందులో 10-12 ప్లే స్కూళ్లు సొంతంగా ఉంటాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఇప్పటికే 9 కంగారూ కిడ్స్‌ స్కూళ్లు ఉండగా, ఏడాదిలో వీటి సంఖ్య 20 వరకూ చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. విజయవాడ, విశాఖపట్నం, వరంగల్‌పైనా దృష్టి పెడుతున్నట్లు తెలిపారు. ఒక్కో పాఠశాల ఏర్పాటుకు రూ.25లక్షల వరకూ ఖర్చవుతుందని చెప్పారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.