YSRCP vs TDP: పల్నాడు జిల్లాలో వైకాపా దౌర్జన్యం.. తెదేపా కార్యకర్తలపై రాళ్ల దాడి

హోం ఓటింగ్‌ విషయంలో పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదలలో వైకాపా వర్గీయులు రెచ్చిపోయారు. 

Updated : 08 May 2024 15:18 IST

ముప్పాళ్ల: హోం ఓటింగ్‌ విషయంలో పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదలలో వైకాపా వర్గీయులు రెచ్చిపోయారు. రాళ్లు, కర్రలతో విరుచుకుపడ్డారు. 85 ఏళ్లు నిండిన వృద్ధుల కోసం గ్రామంలో ఎన్నికల అధికారులు హోం ఓటింగ్‌ నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి పోలింగ్‌ ప్రక్రియ చేపట్టారు. ఈ క్రమంలో తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వైకాపాకి చెందిన వారు ఒక్కసారిగా రాళ్ల దాడికి దిగారు. ఈ ఘటనలో తెదేపాకు చెందిన కానాల పుల్లారెడ్డి, రావిపాటి నాగేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను తొలుత సత్తెనపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను సత్తెనపల్లి తెదేపా అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పరామర్శించారు. ఆయన సూచన మేరకు కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని