కన్న తండ్రే కొడుకు దారికి అడ్డుపడితే..! - Bell Bottom Telugu Trailer
close
Published : 09/12/2020 23:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కన్న తండ్రే కొడుకు దారికి అడ్డుపడితే..!

ఆకట్టుకుంటున్న బెల్‌బాటమ్‌ ట్రైలర్‌

హైదరాబాద్‌: కన్నడనాట విడుదలై మంచి విజయం సాధించిన చిత్రం ‘బెల్‌బాటమ్‌’. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. టాలీవుడ్‌లో డిటెక్టివ్‌ సినిమాలకు మంచి క్రేజ్‌ ఉంది. అందుకే ప్రముఖ ఓటీటీ వేదిక ‘ఆహా’ ఈ కన్నడ సినిమాను తెలుగులో రీమేక్‌ చేసింది. గతంలో విడుదలైన సినిమా టీజర్‌ అభిమానులను బాగా ఆకట్టుకుంది. తాజాగా.. చిత్ర బృందం ట్రైలర్‌ను సైతం విడుదల చేసింది. అందులో ‘‘ఏది రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుందని.. విధికి తలవంచడమే ఉత్తమమని.. ఎదురెళ్లి ఏమీ చేయలేని మనలాంటి నిస్సహాయుల కథే ‘బెల్‌బాటమ్‌’’ అంటూ సినిమా కథను చెప్పకనే చెప్పారు.

‘చిన్న పిల్లాడికి మొలతాడు ఎంత అవసరమో.. మనిషన్నాక ఒక లక్ష్యం కూడా అంతే అవసరం.. ఆ విధంగా మన నాయకుడు లక్ష్యం కోసం పోరాడుతుండగా.. కన్నతండ్రే దారికి అడ్డుపడుతుంటే..’ అంటూ ట్రైలర్‌ మొదలవుతుంది. హేమగిరి పోలీస్‌స్టేషన్‌ లాకర్‌లో ఉన్న సుమారు రూ.8లక్షలు చోరీకి గురవుతాయి. ఎవరికీ అంతుచిక్కని ఆ కేసును ఛేదించే క్రమంలో పోలీసులు హీరో డిటెక్టివ్‌ దివాకర్‌ సాయం కోరతారు. అప్పటికే ఖాళీగా ఉంటూ.. తండ్రి చేతిలో తిట్లు తింటూ ఉండే దివాకర్‌ ఈ కేసును ఎలాగైనా ఛేదించి మంచి పేరు సంపాదించాలని నిశ్చయించుకుంటాడు. అలా లక్ష్యాన్ని చేరుకోవడానికి హీరో పడే కష్టాలు.. ఈక్రమంలో పోలీసుల చేతిలో హీరో ఎదుర్కొనే అవమానాలు.. వింత అనుభవాలు అద్భుతంగా చూపించారు.

జయతీర్థ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరో డిటెక్టీవ్‌ దివాకర్‌గా కన్న నటుడు రిషబ్‌శెట్టి నటించారు. హరిప్రియ కథానాయిక. ‘ఆహా’లో డిసెంబరు 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. నవ్వులు పూయిస్తున్న ఈ ట్రైలర్‌ను మీరూ చూసేయండి మరి.

ఇదీ చదవండి

డిటెక్టివ్‌ దివాకరం రంగంలోకి దిగితే..!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని