హాలీవుడ్ ‘గ్రే మ్యాన్‌’లో ధనుష్‌... - Dhanush joins Chris Evans Ryan Gosling starrer The Gray Man
close
Published : 18/12/2020 15:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హాలీవుడ్ ‘గ్రే మ్యాన్‌’లో ధనుష్‌...

చెన్నై: కోలీవుడ్ స్టార్‌ కథానాయకుడు ధనుష్ హాలీవుడ్లోకి ప్రవేశించనున్నారు. ‘ఎవెంజర్స్‌’తో పాపులర్‌ అయిన రస్సో బ్రదర్స్‌ ‘ది గ్రే మ్యాన్’ అనే చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. దీనికి సంబంధించిన నటీనటుల పేర్లను చిత్రబృందం విడుదల చేసింది. అందులో కోలీవుడ్ అగ్ర నటుడు ధనుష్‌ నటించనున్నట్లు ప్రకటించారు. ఆంథోనీ రస్సో ‘ది గ్రే మ్యాన్’ గురించి మాట్లాడుతూ... ‘ఈ చిత్రం ఇద్దరు గొప్ప నటులు అమెరికా నిఘా సంస్థ సీఐఏ రెండు విభిన్న రూపాలను చూపే పాత్రలు పోషిస్తున్నారు. అది ఎలా ఉంటుంది.. ఏమి చేస్తుందని అనేది చూపిస్తారు. వాస్తవికతకు మరింత దగ్గరగా ఉంటుంది’ అని అన్నారు.

‘ఏది ఏమైనా గోస్లింగ్ మరియు ఎవాన్స్‌తో సినిమా తీయాలనేది మాకు ఒక కల. ఈ చిత్రంలో వీరు మాస్టర్ హంతకులుగా చేయనున్నారు. నెట్‌ఫ్లిక్స్‌తో మాకు మంచి అనుబంధం ఉంది. స్కాట్ స్టబర్‌తో మనం 20 ఏళ్లు వెనక్కి వెళతాం. ఈ చిత్రానికి నెట్‌ఫ్లిక్స్ సరైన ప్లాట్‌ఫామ్ అని మేము భావిస్తున్నాం’ అని జో రస్సో తెలిపారు. 

హాలీవుడ్‌లో ధనుష్‌ కెరీర్‌లో ఈ చిత్రం రెండవ అంతర్జాతీయ ప్రాజెక్ట్. ఇంతకుముందు 2018లో వచ్చిన ‘ది ఎక్ట్స్రాడినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్‌’ చిత్రంలో నటించారు. 

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని