సూర్య.. మీ నిర్ణయం మార్చుకోండి: హరి - Director Hari requests Suriyato change his decision to release Soorarai pottru on OTT
close
Published : 26/08/2020 01:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సూర్య.. మీ నిర్ణయం మార్చుకోండి: హరి

చెన్నై: తమిళంతో పాటు, తెలుగులోనూ మార్కెట్‌ ఉన్న కథానాయకుడు సూర్య. ఆయన నటించిన ప్రతి చిత్రం ఇక్కడ విడుదలవుతుంది. సుధ కొంగర దర్శకత్వంలో సూర్య నటించిన తమిళ చిత్రం ‘సూరారైపోట్రు’. తెలుగులో ‘ఆకాశమే నీ హద్దురా’గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎయిర్‌డెక్కన్‌ వ్యవస్థాపకుడు జీఆర్‌ గోపీనాథ్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఈ సినిమాను సెప్టెంబరు 30న అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదల చేయనున్నట్లు సూర్య ఇటీవల  ప్రకటించారు.

ఈ నేపథ్యంలో తమిళ దర్శకుడు హరి.. సూర్యకు ఒక విన్నపం చేశారు. ‘ఆకాశమే నీ హద్దురా’ చిత్రాన్ని ఓటీటీ వేదికగా విడుదల చేసే ఆలోచనపై పునరాలోచన చేయాలని కోరారు. ఈ మేరకు ఆయనకు లేఖరాశారు. సూర్య నటనకు తానూ అభిమానినని అందుకే విన్నపం చేస్తున్నట్లు తెలిపారు. ఆయన చిత్రాలను పెద్ద తెరపై చూస్తేనే బాగుంటాయని అన్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘సింగమ్‌’ సిరీస్‌ చిత్రాలు అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ విశేషంగా అలరించాయి.

అపర్ణా బాల మురళి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో మోహన్‌బాబు, జాకీ ష్రాఫ్‌, పరేశ్‌రావల్‌, సంపత్‌రాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీవి ప్రకాశ్‌కుమార్‌ స్వరాలు సమకూరుస్తున్నారు
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని