వ్యవస్థల వైఫల్యంతోనే స్నేహలత హత్య: పవన్ - Janasena Chief Pawan Kalayn on Snehalatha Murder
close
Updated : 25/12/2020 01:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వ్యవస్థల వైఫల్యంతోనే స్నేహలత హత్య: పవన్

దిశ చట్టం ఏవిధంగా ప్రజలకు రక్షణ?
సీఎం, హోంమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్‌

అమరావతి: చిత్తశుద్ధి లేకుండా చట్టాలు చేస్తే ఎంతమాత్రం ప్రయోజనం ఉండదని.. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ దిశ చట్టమేనని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. ఏపీ అసెంబ్లీలో ఆ చట్టం చేసి ఏడాది పూర్తయినా ఆచరణలోకి మాత్రం తీసుకురాలేదని విమర్శించారు. రాష్ట్రంలో వ్యవస్థల వైఫల్యమే అనంతపురం జిల్లా ధర్మవరంలో యువతి స్నేహలత ప్రాణాలు తీసిందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు పవన్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని మైనర్‌ బాలికలు, విద్యార్థినులు, యువతులు, మహిళలపై అఘాయిత్యాలు, దాడులు ఆగడం లేదని.. ఉన్మాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో రెండు, గాజువాకలో ఒక ఘటన జరిగాయని.. ఇప్పుడు ధర్మవరంలో దళిత యువతి హత్యకు గురికావడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. తమ బిడ్డను వేధిస్తున్నారంటూ ఆమె తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే అక్కడి అధికారుల ప్రవర్తన వారిని మరింత కుంగదీసిందన్నారు. ‘అక్కడి నుంచి ఇల్లు మారిపోండి’ అంటూ పోలీసులు సలహా ఇవ్వడం చూస్తే ఆ వ్యవస్థ ఎంత బాధ్యతారాహిత్యంతో ఉందో అర్థమవుతోందన్నారు. 

వ్యవస్థల వైఫల్యంతోనే ఇద్దరు దుర్మార్గుల చేతుల్లో స్నేహలత ప్రాణాలు కోల్పోయిందని పవన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మహిళల రక్షణ కోసం దిశ చట్టం చేశామని, నేరం చేసిన వారికి 21 రోజుల్లో శిక్ష పడుతుందంటూ ప్రచారం చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆచరణలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదన్నారు. ఈ చట్టం ఏవిధంగా రక్షణ ఇస్తుందో సీఎం జగన్‌, రాష్ట్ర హోంమంత్రి సుచరిత ప్రజలకు సమాధానం చెప్పాలని పవన్‌ డిమాండ్‌ చేశారు. స్నేహలత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని