close

తాజా వార్తలు

Published : 24/11/2020 01:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రష్మిక వంట.. ఉపాసన ఫిదా..!

నెటిజన్లను ఆకట్టుకుంటోన్న వీడియో

హైదరాబాద్‌: తన కమ్మనైన వంటతో నటి రష్మిక.. ఉపాసన కొణిదెలను ఫిదా చేశారు. ఫిట్‌నెస్‌, ఆరోగ్యం ప్రధానాంశాలుగా ఉపాసన నిర్వహిస్తున్న వెబ్‌సైట్‌.. ‘యువర్‌ లైఫ్’. అతిథి సంపాదకురాలిగా వ్యవహరించిన సమంత కొన్నిరోజుల క్రితం ఫిట్‌నెస్‌ విషయంలో తీసుకోవాల్సిన పలు జాగ్రత్తల గురించి అభిమానులతో ఎన్నో విషయాలు పంచుకున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా కొన్ని ఆరోగ్యకరమైన వంటకాలను సైతం నెటిజన్లకు పరిచయం చేశారు.

తాజాగా, ‘యువర్‌ లైఫ్‌’లో రష్మిక మందనా భాగమయ్యారు. చికెన్‌తో ‘కోలీపుట్టు’ కూర వండి ఉపాసనకు రుచి చూపించారు. రష్మిక వంటకానికి 100 మార్కులు వేసిన ఉపాసన.. ‘ఈ యువ నటి సినీ ఇండస్ట్రీలో తప్పకుండా మాంచి సక్సెస్‌ సాధిస్తుంది. ఒకవేళ ఎవరైనా ఈమెకు చెఫ్‌గా అవకాశం ఇస్తే సూపర్‌గా వంట చేస్తుంది’ అని ప్రశంసలు కురిపించారు. రష్మిక-ఉపాసనల సరదా సంభాషణలతో ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన