‘టైగర్‌’ కండల షో.. శునకానికి శౌర్య కానుక - Social Look
close
Published : 29/12/2020 01:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘టైగర్‌’ కండల షో.. శునకానికి శౌర్య కానుక

సోషల్‌ లుక్‌: తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినీ హీరో నాగశౌర్య తన పెంపుడు శునకానికి కానుక ఇస్తున్న ఒక ఫొటోను ఇన్‌స్టాలో పోస్టు చేశారు. తన తల్లితో పాటు పెంపుడు శునకాన్ని ఉద్దేశిస్తూ.. నాకు ఇష్టమైన వారిద్దరితో క్రిస్మస్‌ ఇలా గడిచిపోయిందని అందులో పేర్కొన్నారు. 

* ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ ఇచ్చిన విజయాన్ని హీరోయిన్‌ నభానటేశ్‌ బాగా సెలబ్రేట్‌ చేసుకుంటోంది. సినిమా షూటింగ్‌ సందర్భంగా స్కూల్‌ డ్రెస్‌లో ఆమె తీసుకున్న వీడియోలను అభిమానులతో పంచుకుంది.

* హీరోయిన్‌ ఐశ్వర్యరాజేశ్‌.. ముద్దులొలికే తన పెంపుడు శునకాన్ని ఎత్తుకుంటున్న సమయంలో తీసిన ఓ వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. 

* తెల్లవారుజామున 2గంటలకు షూటింగ్‌ సందర్భంగా తీసిన ఓ వీడియోను రేణుదేశాయ్‌ అభిమానులతో పంచుకున్నారు. 

* మనం ఇంకా కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండాలని మంచులక్ష్మి సూచనలు చేశారు. దానికి సంబంధించిన ఆమె ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంచారు.

* హీరోయిన్‌ అమీషా పటేల్‌ ఓ పోస్టు చేసింది. అందులో జుట్టును సరిచేసుకుంటూ కనిపించింది. 

* బాలీవుడ్‌ హీరో టైగర్‌ ష్రాఫ్‌ మరోసారి తన కండల ప్రదర్శన చేశారు. షర్టు ‌లేకుండా దిగిన ఒక ఫొటోను అభిమానులతో షేర్‌ చేసుకున్నారు.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని