కృతితో సమయం గడపాలి: సుశాంత్‌సింగ్‌ - Sushant Singh Rajput mentioned that he has to spend time with Kriti in 2018
close
Published : 18/09/2020 19:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కృతితో సమయం గడపాలి: సుశాంత్‌సింగ్‌

వెలుగులోకి వచ్చిన నటుడి 2018 డైరీ

ముంబయి: తనకి అత్యంత సన్నిహితురాలైన కృతిసనన్‌తో సరదాగా సమయాన్ని గడపాలని బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ ఒకానొక సమయంలో భావించారు. ఈ విషయాన్ని ఆయన ఓ డైరీలో పేర్కొన్నారు. సుశాంత్‌ అనుమానాస్పద మృతి కేసును ప్రస్తుతం అంతటా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితం తన డైలీలైఫ్‌ గురించి సుశాంత్‌ సింగ్‌ రాసుకున్న డైరీని ఓ ఆంగ్ల పత్రిక బహిర్గతం చేసింది. ఏప్రిల్‌ 27, 2018లో తెల్లవారుజామున రెండు గంటలకే నిద్రలేచి.. ఓ కప్పు టీతో తన రోజువారీ జీవితాన్ని ప్రారంభించానని సుశాంత్‌ అందులో రాశారు. అంతేకాకుండా ఇకపై ధూమపానం చేయకూడదని, కృతితో(కృతిసనన్‌) సమయాన్ని గడపాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. సుశాంత్‌-కృతిసనన్‌ కలిసి ‘రాబ్తా’ చిత్రం కోసం కలిసి పనిచేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు పుకార్లు కూడా వచ్చాయి. అయితే సుశాంత్‌ డైరీలో రాసిన దానిని బట్టి చూస్తే 2018 నాటికి ఆయనకి రియాతో ఎలాంటి పరిచయం లేనట్లు తెలుస్తోంది. తన సోదరి ప్రియాంక, ఆమె భర్తతో కలిసి టూర్‌కు వెళ్లాలనుకుంటున్నట్లు సుశాంత్‌ అందులో రాసుకున్నారు. తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన విషయాలతో పాటు పలు సందేశాలను కూడా ఆయన డైరీలో పొందుపరుచుకున్నారు. సుశాంత్‌కు చెందిన పవనా ఫామ్‌హౌస్‌ నుంచి ఈ డైరీ బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని