హఫీజ్‌ సయీద్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష - Terrorist Hafiz Saeed Gets 10-Year Jail Term
close
Updated : 20/11/2020 02:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హఫీజ్‌ సయీద్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష

ఇస్లామాబాద్‌‌: కరడుగట్టిన అంతర్జాతీయ ఉగ్రవాది, ముంబయి పేలుళ్ల కుట్రలో ప్రధాన సూత్రధారి హఫీజ్‌ సయీద్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఉగ్రవాద దాడులకు సంబంధించిన రెండు కేసుల్లో పాక్‌ ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం అతడికి శిక్ష విధించింది. జమాత్‌ ఉల్‌ దవా (జేయూడీ) సంస్థ చీఫ్‌గా ఉన్న సయీద్‌ 2008 ముంబయి పేలుళ్ల వెనుక ప్రధాన సూత్రధారి. ఉగ్రవాద సంస్థలకు నిధులు అందిస్తున్నారన్న కేసులో ఇప్పటికే 11 ఏళ్లు జైలు శిక్ష పడగా.. అతడు ప్రస్తుతం లాహోర్‌లోని ఓ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. తాజాగా హఫీజ్‌తో పాటు మరో నలుగురికి పాకిస్తాన్‌ ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. ఉగ్ర సంస్థలకు నిధులు అందిస్తున్నారన్న ఆరోపణలపై అతడితో పాటు జేయూడీ సభ్యులపై పాక్‌ ఉగ్ర నిరోధక విభాగం దాదాపు 41 కేసులు పెట్టగా. వాటిల్లో రెండు కేసుల్లో గురువారం శిక్ష పడింది.

ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు ముందుండి అన్నీ చూసుకొనే జేయూడీ చీఫ్‌గా ఉన్న సయీద్‌.. ఐక్యరాజ్యసమితి ప్రకటించిన అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలోనూ ఉన్నాడు. అంతేకాకుండా అమెరికా అతడి తలపై 10 మిలియన్‌ డాలర్ల పారితోషికం ప్రకటించింది. 2008 ముంబయి పేలుళ్ల ఘటనలో 166 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది క్షతగాత్రులైన ఘటన యావత్‌ ప్రపంచాన్ని కలిచివేసిన విషయం తెలిసిందే.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని