close

తాజా వార్తలు

Updated : 05/12/2020 11:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సీనియర్‌ నటి జయచిత్ర ఇంట విషాదం

చెన్నై: సీనియర్‌ నటి జయచిత్ర ఇంట విషాదం నెలకొంది. ఆమె భర్త గణేష్‌ శుక్రవారం కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన మృతి చెందారని వైద్యులు నిర్ధారించినట్లు సమాచారం. గణేష్‌ పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం పోయెస్‌గార్డెన్‌లో ఉంచారు. శనివారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు నటి కుటుంబసభ్యులు వెల్లడించారు.

జయచిత్ర తెలుగుతోపాటు తమిళ చిత్ర పరిశ్రమలో మాంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కె.ఎస్‌.గోపాలకృష్ణన్‌ దర్శకత్వం వహించిన ‘కురట్టి మగన్‌’తో ఆమె వెండితెరకు పరిచయమయ్యారు. అనంతరం ఆమె తమిళంలో అగ్రకథానాయకుల సరసన వరుస సినిమాలు చేసి స్టార్‌ హీరోయిన్‌గా పేరు పొందారు. అంతేకాకుండా, తెలుగులో ‘సోగ్గాడు’, ‘కటకటాల రుద్రయ్య’, ‘బొబ్బిలి పులి’, ‘అబ్బాయిగారు’, ‘ఘరానా బుల్లోడు’ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. సినిమాల్లో నటిస్తున్న తరుణంలోనే 1983లో ఆమె గణేష్‌తో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం తమిళ పరిశ్రమలో సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న అమ్రేష్‌ గణేష్‌ వీరి కుమారుడే.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన