చెమట చిందిస్తున్న కోహ్లీ..ఫొటోలు వైరల్ - Virat Kohli Sweats It Out In Gym Ahead Of Australia Tour
close
Published : 21/11/2020 21:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చెమట చిందిస్తున్న కోహ్లీ..ఫొటోలు వైరల్

ఇంటర్నెట్‌డెస్క్: గత కొన్ని రోజులుగా క్రికెట్ ప్రపంచమంతా టీమిండియా సారథి విరాట్ కోహ్లీ గురించే చర్చిస్తోంది. దానికి కారణం పితృత్వ సెలవులపై ఆస్ట్రేలియాతో చివరి మూడు టెస్టులకు విరాట్ దూరమవ్వడం. కోహ్లీ గైర్హాజరీ భారత జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ఆసీస్‌కు సానుకూలాంశమవుతుందని చర్చలు జోరుగా సాగుతున్నాయి. కోహ్లీ జట్టులో లేకపోయినా టీమిండియా గొప్ప ప్రదర్శన చేస్తుందని కొందరు అభిప్రాయపడుతుండగా మరికొందరు టెస్టు సిరీస్‌ను 1-2తో టీమిండియా చేజార్చుకోవచ్చని జోస్యం చెబుతున్నారు.

అయితే కోహ్లీ తన దృష్టంతా ఆటపైనే ఉంచాడు. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు ఇటీవల పోస్ట్ చేశాడు. తాజాగా శారీరక కసరత్తులు చేస్తున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. దీనికి ‘ఇంధనం సమకూర్చుకుంటున్నా’ అని వ్యాఖ్య జత చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. పోస్ట్ చేసిన మూడు గంటల్లోనే రెండు లక్షల మందికి పైగా లైకులు కొట్టారు. కోహ్లీతో పాటు పేసర్ మహ్మద్‌ షమి కూడా జిమ్‌ చేస్తున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. తినడం, లిఫ్టింగ్ అంటే తనకి ఎంతో ఇష్టమని దానికి వ్యాఖ్య జోడించాడు. ఆస్ట్రేలియాతో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనున్న సంగతి తెలిసిందే. నవంబర్ 27న సిడ్నీ వేదికగా తొలి వన్డే జరగనుంది.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని