‘‘షారుక్‌ ఖాన్‌ పోజ్‌ అంత దూరం పాటించండి’’ - assam police used sharukh khan iconic pose for social distance
close
Published : 20/07/2020 01:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘‘షారుక్‌ ఖాన్‌ పోజ్‌ అంత దూరం పాటించండి’’

సామాజిక దూరంపై అసోం పోలీసుల వినూత్న ప్రచారం

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి ప్రస్తుతం మన వద్ద ఉన్న రెండే రెండు అస్త్రాలు మాస్క్‌ ధరించడం, సామాజిక దూరం పాటించడం. అందుకే వీటిపై ప్రజలకు ప్రభుత్వాలు అనేక విధాలుగా అవగాహన కల్పిస్తున్నాయి. ప్రకటనలు ఇస్తున్నాయి, ప్రముఖులతో సందేశాలు ఇప్పిస్తున్నాయి. అయితే అసోం పోలీసులు మాత్రం వినూత్నంగా ఆలోచించారు. బాలీవుడ్‌ కింగ్‌ ఖాన్‌ షారుక్‌ ఖాన్‌ అనగానే గుర్తొచ్చే ఐకానిక్‌ పోజ్‌ను కరోనా కట్టడి అవగాహనకు ఉపయోగించారు. షారుఖ్‌ పోస్టర్‌తో అసోం పోలీసులు చేసిన ఈ అవగాహన కల్పించే ట్వీట్‌ నెట్టింట్లో వైరల్‌ అయింది. 

షారుక్‌ ఖాన్‌ రొమాంటిక్‌ హీరో. అనేక ప్రేమకథల్లో నటించి అమ్మాయిల హృదయాలు కొల్లగొట్టాడు. షారుఖ్‌ తన సినిమాల్లో అప్పుడప్పుడు ప్రేమగా చేతులు చాచి ఇచ్చే పోజ్‌ చాలా పాపులర్‌. రాను రాను అది షారుఖ్‌  పోజ్‌గా మారిపోయింది. ఇప్పుడు ఆ పోజ్‌ను అసోం పోలీసులు సామాజిక దూరం పాటించడానికి ప్రతీకగా మార్చేశారు. పోలీసులు పోస్టు చేసిన ఫొటోలో షారుఖ్‌కు గ్రాఫిక్స్‌లో మాస్క్‌ పెట్టారు. రెండు చేతులు చాచినప్పుడు ఉండేంత దూరాన్ని పాటించాలని సూచించారు. సామాజిక దూరం ప్రాణాలు కాపాడుతుందని కాప్షన్‌ ఇచ్చారు. అంతేకాదు. ‘బాజీగర్‌’ చిత్రంలోని షారుక్‌ ఖాన్‌ ఫేమస్‌ డైలాగ్‌ ‘‘కొన్నిసార్లు గెలవాలంటే కొన్ని వదులుకోవాలి. అలా వదులుకొని గెలిచేవాణ్ని బాజీగర్‌ అంటారు’’అనే డైలాగ్‌ను ఇప్పటి కరోనా పరిస్థితులకు అనుగుణంగా మార్చి ‘‘దగ్గరవ్వాలంటే కొన్నిసార్లు దూరం వెళ్లాల్సి ఉంటుంది. అలా దూరం వెళ్లి దగ్గరగా వచ్చేవారిని బాజిగర్‌ అంటారు’’అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆరు అడుగుల దూరం పాటించండి.. బాజిగర్‌ అవ్వండి అంటూ అసోం పోలీసులు చేసిన ట్వీట్‌ అందరిని ఆకట్టుకుంటోంది. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని