భారత్‌లో కరోనా.. ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం! - australians to face jail or heavy fine if they go home from india
close
Published : 01/05/2021 01:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌లో కరోనా.. ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం!

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశ చరిత్రలో తొలిసారి ఆస్ట్రేలియా ప్రభుత్వం తమ దేశ పౌరులపై కఠిన నిబంధనలు విధించింది. భారత్‌లో కరోనా ఉగ్రరూపం కొనసాగుతున్న వేళ ఇక్కడి నుంచి తమ దేశానికి వచ్చే ఆస్ట్రేలియన్లపై తాత్కాలికంగా నిషేధం విధించింది. భారతదేశంలో 14 రోజుల పాటు ఉన్న ఆస్ట్రేలియా పౌరులు తమ దేశంలోకి అడుగు పెడితే ఐదేళ్ల పాటు జైలుశిక్ష లేదా 66 వేల డాలర్లు (సుమారుగా 49 లక్షల రూపాయలు) జరిమానా విధిస్తామని హెచ్చరించింది. కాగా, ఈ నిబంధన శనివారం నుంచి అమలులోకి రానుంది.

ఆస్ట్రేలియా ప్రభుత్వం బయో సెక్యూరిటీ యాక్ట్‌ చట్టం కింద ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చింది. భారత్‌లో కరోనా ఉద్ధృతి పెరుగుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలో సుమారు 9,000 మంది ఆస్ట్రేలియన్లు నివసిస్తున్నారని, వాళ్లలో దాదాపు 600 మందికి కరోనా సోకే ప్రమాదం ఉందని ఆస్ట్రేలియా చెబుతోంది. ఐపీఎల్‌లో పాల్గొనేందుకు ఇండియాకి వచ్చిన ఆస్ట్రేలియా క్రికెటర్లు, శిక్షణా సిబ్బందికి ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ నిబంధన నుంచి సడలింపు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. కాగా ఏప్రిల్‌ 27 నుంచి మే 15 వరకూ భారతదేశం నుంచి వచ్చే విమానాలను తాత్కాలికంగా నిషేధించిన విషయం తెలిసిందే. కఠినమై ఆంక్షల వల్ల అక్కడ కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టింది. కొత్తగా 30 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి. డబ్ల్యూహెచ్‌వో గణాంకాల  ప్రకారం ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకూ 29,779 కేసులు నమోదు కాగా 910 మరణాలు సంభవించాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని