‘విద్యార్థుల సమస్యలపై ఈనెల 18న ఆందోళనలు’ - bhatti vikramarka demond on release of nsui leaders
close
Updated : 12/08/2020 23:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘విద్యార్థుల సమస్యలపై ఈనెల 18న ఆందోళనలు’

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వెల్లడి

హైదరాబాద్‌: ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తల అరెస్టును కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండించింది. వెంటనే వారిని విడుదల చేయాలని డిమాండ్‌ చేసింది. విశ్వవిద్యాలయాల్లో ప్రవేశ పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ సీఎం క్యాంపు కార్యాలయం ప్రగతిభవన్‌ ముట్టడికి ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి నాయకులు యత్నించిన విషయం తెలిసిందే. దీంతో ఆందోళనకారుల్ని పోలీసులు అరెస్టు చేశారు. వారి అరెస్టును సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఖండించారు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే ఎమ్మెల్యేలకే అనుమతి లేదంటున్నారని, పోలీస్‌ స్టేషన్లు ఏమైనా తెరాస పార్టీ కార్యాలయాలా? అని ప్రశ్నించారు.

‘‘కరోనా నేపథ్యంలో పిల్లల చదువు ఎలా అని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. అందుకే సమగ్ర విద్యా విధానం ప్రకటించాలని ఎన్‌ఎస్‌యూఐ ప్రభుత్వాన్ని కోరింది. ప్రైవేటు విద్యాసంస్థల్లో పాఠాలు చెబుతున్నారు. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితిపై మాత్రం స్పష్టత లేదు. విద్యార్థుల సమస్యలపై ఈనెల 18న ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు కాంగ్రెస్‌ అండగా ఉంటుంది’’అని భట్టి విక్రమార్క చెప్పారు.

‘‘ప్రజా సంక్షేమాన్ని విస్మరించారు.. నిర్బంధం పెంచారు. ప్రజా సమస్యలపై నిరసన వ్యక్తం  చేసే హక్కు  ప్రతి పౌరుడికి ఉంటుంది. కోర్టులో కేసు ఉండగా పరీక్షల నిర్వహణకు పూనుకోవడం తగదు. రోజురోజుకూ రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఇలాంటి సమయంలో ప్రవేశ పరీక్షలను రీషెడ్యూల్‌ చేయడమేంటి? వెంటనే ప్రభుత్వం పరీక్షలను నిలుపుదల చేయాలి’’అని టీపీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. 

విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఎంపీ కోమటిరెడ్డి మండిపడ్డారు. ‘‘విద్యార్థులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం ఎక్కువ రోజులు అధికారంలో లేదు. అరెస్టు చేసిన ఎన్‌ఎస్‌యూఐ నాయకులను వెంటనే విడుదల చేయాలి. విద్యార్థుల ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలి’’అని అన్నారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని