‘పీఎస్‌పీకే 27’ కోసం చార్మినార్‌ - charminar set for pspk 27
close
Published : 09/02/2021 15:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘పీఎస్‌పీకే 27’ కోసం చార్మినార్‌

హైదరాబాద్‌ :  పవన్‌ కల్యాణ్ కథానాయకుడుగా క్రిష్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. పీరియాడికల్‌ డ్రామా నేపథ్యంలో భారీ అంచనాల నడుమ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ‘PSPK27’ వర్కింగ్‌ టైటిల్‌తో చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రం నుంచి ఓ ఆసక్తికర అప్‌డేట్‌ బయటకు వచ్చింది. చరిత్రాత్మక కథాంశంగా రానున్న ఈ సినిమాలో 17వ దశాబ్దం నాటి పరిస్థితులు చూపించనున్నారు. ఇందులో భాగంగా చార్మినార్‌ వైభవం గురించి  చెప్పనున్నారట. అధిక శాతం చార్మినార్‌పై చిత్రీకరణ జరపాల్సి రావడంతో ఈ సినిమా కోసం భారీ బడ్జెట్‌తో చార్మినార్‌ సెట్‌ని రూపొందిస్తున్నట్టు సమాచారం. 

ఈ సినిమా టైటిల్‌ ఇంకా ఖరారు కాకపోవడంతో ‘హరిహర వీరమల్లు’, ‘విరూపాక్ష’ లాంటి పేర్లు ప్రచారంలో నిలిచాయి. ‘మరికొన్ని రోజుల సమయం తీసుకుని మంచి టైటిల్‌ మీ ముందుకు తీసుకొస్తామ’ని చిత్ర సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు ఈ సినిమాలో నటిస్తున్నట్లు నిధి అగర్వాల్‌ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ.ఎం.రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. 

ఇదీ చదవండి..

క్రేజీ డైరెక్టర్‌తో నాగచైతన్య..!



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని