కరోనా ‘మహా’ ఉద్ధృతి: కొత్తగా 23వేల కేసులు - corona update in maharastra
close
Published : 17/03/2021 23:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా ‘మహా’ ఉద్ధృతి: కొత్తగా 23వేల కేసులు

ముంబయి: మహారాష్ట్రలో కరోనా వైరస్‌ మళ్లీ కల్లోలం రేపుతోంది. రోజురోజుకీ రికార్డు స్థాయిలో నమోదవుతున్న కొత్త కేసులు కలవర పెడుతున్నాయి. గడిచిన 24గంటల వ్యవధిలో 23,179 కొత్త కేసులు, 84 మరణాలు నమోదయ్యాయి. ఒక్క ముంబయి మహా నగరంలోనే 2,377 కొత్త కేసులు, ఎనిమిది మరణాలు వెలుగుచూడటం అక్కడ వైరస్‌ వ్యాప్తి ఉద్ధృతికి అద్దంపడుతోంది.

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,78,35,495 శాంపిల్స్‌ పరీక్షించగా.. 23,70,507 మందిలో వైరస్‌ వెలుగుచూసింది. ఇప్పటి వరకు 21,63,391 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 53,080 మంది మృతిచెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,52,760 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వీటిలో పుణెలో అత్యధికంగా 32,359, నాగ్‌పూర్‌లో 21496 క్రియాశీల కేసులు ఉండగా.. ముంబయిలో 15,410, ఠానేలో 14,644, నాసిక్‌ 9,821, ఔరంగాబాద్‌ 9,621 చొప్పున ఉన్నాయి. మరోవైపు, రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 13.29%, రికవరీ రేటు 91.26%గా ఉంది. మరణాల రేటు 2.24% ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.

దిల్లీలో కొత్తగా 536 కేసులు
అటు, దేశ రాజధాని నగరం దిల్లీలోనూ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 536 కొత్త కేసులు నమోదయ్యాయి. జనవరి 1 తర్వాత ఇంత భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. మరోవైపు, తాజాగా ముగ్గురు మరణించగా.. 319 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం దిల్లీలో 2702 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని