మహారాష్ట్రలో మరో 309 మంది మృతి - covid cases update in maharastra
close
Published : 10/04/2021 23:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహారాష్ట్రలో మరో 309 మంది మృతి

ముంబయి: మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి ఆగడం లేదు. రోజురోజుకీ నమోదవుతున్న కొత్త కేసులు ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. దేశంలో రోజువారీగా వెలుగుచూస్తున్న మొత్తం కేసుల్లో సగానికి పైగా ఇక్కడే ఉండటం గమనార్హం. గడిచిన 24గంటల్లో మహారాష్ట్రలో 55,411 కేసులు, 309 మరణాలు నమోదయ్యాయి. శనివారం మరో 53,005మంది కోలుకున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన  తాజా గణాంకాలతో ఇప్పటివరకు మహారాష్ట్రలో 2.18 కోట్ల శాంపిల్స్‌ పరీక్షించగా 33.43లక్షల మందికి పైగా వైరస్‌ బారినపడ్డారు. వీరిలో 27.48లక్షల మంది కోలుకోగా.. 57,638మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం మహారాష్ట్రలో 5,36,682 క్రియాశీల కేసులు ఉన్నాయి.

మరోవైపు, రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై శనివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించిన సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే లాక్‌డౌన్‌ విధించేందుకే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా ఆయన ఆదివారం కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందంతో సమావేశం నిర్వహించనున్నారు. లాక్‌డౌన్‌ విధించే అంశంపై మరో రెండు రోజుల్లో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని