కరోనాను అంతమొందించడం సులువే! - ending covid 19 pandemic easy in comparison to climate change bill gates
close
Updated : 16/02/2021 12:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనాను అంతమొందించడం సులువే!

బిల్‌గేట్స్‌

వాషింగ్టన్‌: వాతావరణ సంక్షోభంతో పోలిస్తే... కరోనా వైరస్‌ సంక్షోభాన్ని అంతం చేయడం చాలా సులభమని మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్‌ అభిప్రాయపడ్డారు. ఆయన రాసిన ‘హౌ టు అవాయిడ్‌ క్లైమేట్‌ డిజాస్టర్‌’ అనే పుస్తకంపై ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా... ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ఈ రెండు సంక్షోభాల గురించి మాట్లాడారు.

‘రాబోయే 30 ఏళ్లలో జరగనున్న వాతావరణ మార్పుల గురించి మనం ఎప్పుడూ మాట్లాడుకోలేదు. కానీ ఏటా 51బిలియన్‌ గ్రీన్‌ హౌజ్‌ వాయువులు వాతావరణంలోకి వచ్చి చేరుతున్నాయి. దాన్ని జీరోకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కర్బన రహిత విద్యుత్ ఉత్పత్తి కోసం విండ్‌, సోలార్‌ వంటి పునరుత్పాదక వనరుల్ని ఎంపిక చేసుకోవాలి. హరిత ఉత్పత్తుల తయారీకై ప్రభుత్వాలు ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించాలి. ఈ దిశగా పరిశోధనలకు ప్రభుత్వాలు ప్రోత్సాహం కల్పించి పెట్టుబడులకు ముందుకు రావాలి’ అని బిల్‌గేట్స్‌ విజ్ఞప్తి చేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని