విద్యాలయాలకు సెలవులుండవు
మరి కలెక్షన్లు ఎలా?
తెలుగులో అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా విడుదలయ్యే సినిమాలు అరుదు. సంక్రాంతికి వస్తాయనుకున్నవి వేసవికి... వేసవి సినిమాలేమో దసరాకి అన్నట్టుగా వాయిదాలు పడుతూనే ఉంటాయి. అగ్ర తారల విషయంలో అయితే... ఏళ్లకి ఏళ్లు ఈ పర్వం కొనసాగుతూ ఉంటుంది. కొన్నిసార్లు సినిమాలు పూర్తి కాక... మరికొన్నిసార్లు పూర్తయినా పరిస్థితులు అనుకూలించక తేదీలు మారిపోతూ ఉంటాయి. కరోనా తర్వాత ఆ విషయంలో మరింత అనిశ్చితి కొనసాగుతోంది. సంక్రాంతి బరిలోకి దిగేందుకు దాదాపు పది సినిమాలు సన్నాహాలు చేశాయి. వాటిలో నాలుగే ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఇక మిగిలినవన్నీ వేసవిపై దృష్టి పెట్టాయి. మరి అందులో విడుదలయ్యేవి ఎన్ని? మరో సీజన్‌కి వాయిదా పడేవెన్ని?
కరోనా భయాలు కొనసాగుతున్నా థియేటర్‌కి వచ్చారు ప్రేక్షకులు. సంక్రాంతి సినిమాల్ని ఆస్వాదించారు. అది చూశాక చిత్రసీమ మరింత బిజీ అయిపోయింది. వడివడిగా సినిమాల్ని ముస్తాబు చేయడంపై దృష్టి పెట్టింది. సంక్రాంతి తర్వాత అతి పెద్ద సీజన్ అయిన వేసవిని లక్ష్యంగా చేసుకుని విడుదల తేదీల్ని ప్రకటిస్తున్నారు నిర్మాతలు. సుదీర్ఘంగా సాగే ఈ సీజన్ లక్ష్యంగా ఇప్పటిదాకా రేసులో కనిపించని చిత్రాలూ ముస్తాబవుతున్నాయి.
తేదీలు ఖరారయ్యాయి
సంక్రాంతి తర్వాత కొన్నాళ్లపాటు థియేటర్లు వెలవెలబోతుంటాయి. పనులతో ప్రేక్షకులు థియేటర్లకి రారని చిత్రసీమ నమ్ముతుంటుంది. అందుకే అగ్ర తారల సినిమాలు కాకుండా... పరిమిత వ్యయంతో రూపొందినవి, మధ్యలో ప్రేమికుల రోజు వస్తుంది కాబట్టి ప్రేమకథలు ఎక్కువ విడుదలవుతుంటాయి. మార్చి నుంచి అగ్ర తారల సినిమాల జోరు కనిపిస్తుంటుంది. వేసవి సీజన్ ఆరంభమయ్యేది అప్పట్నుంచే. అందుకే బాక్సాఫీసు ముందుకు వరస కడుతుంటాయి. డిసెంబరు వరకూ సంక్రాంతి రేసులో ఉన్న ‘రంగ్ దే’ ఇప్పుడు వేసవికి విడుదల తేదీని పక్కా చేసింది. నితిన్ కథానాయకుడిగా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ చిత్రం మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రానా కథానాయకుడిగా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘అరణ్య’ ఇదే తేదీనే విడుదల కాబోతోంది. నాని కథానాయకుడిగా నటిస్తున్న ‘టక్ జగదీష్’ ఏప్రిల్ 16న విడుదల కాబోతోంది. నాగచైతన్య ‘లవ్‌స్టోరీ’ ఇప్పటికే పూర్తయింది. మరి అది వేసవికే వస్తుందా లేక, అంతకంటే ముందే విడుదలవుతుందా అనేది తెలియాల్సి ఉంది.
బరిలో చాలానే...
అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్‌బ్యాచ్‌లర్’ని సంక్రాంతికే విడుదల చేయాలనుకున్నారు. కుదర్లేదు.ఇటీవలే వేసవికి విడుదల అని చిత్ర బృందం ప్రకటించింది. రానా కథానాయకుడిగా నటిస్తున్న ‘విరాటపర్వం’ వేసవి బాటే పట్టింది. గోపీచంద్ ‘సీటీమార్’, నితిన్ ‘చెక్’, మంచు విష్ణు ‘మోసగాళ్ళు’, శర్వానంద్ ‘శ్రీకారం’, అడవి శేష్ ‘మేజర్’ తదితర చిత్రాలన్నీ వడివడిగా ముస్తాబవుతున్నాయి. మరి వీటిలో ఎన్ని వేసవికి వస్తాయో చూడాలి.
ఆ మూడింటిపైనే దృష్టి
పవన్‌కల్యాణ్ ‘వకీల్‌సాబ్’,వెంకటేష్ ‘నారప్ప’, చిరంజీవి ‘ఆచార్య’, ప్రభాస్ ‘రాధేశ్యామ్’... ఈ సినిమాల విడుదలలే, మిగతా చిత్రాల రాకని ప్రభావితం చేయనున్నాయి. ‘వకీల్‌సాబ్’ చిత్రీకరణ ఇప్పటికే పూర్తయింది. ఇటీవలేటీజర్ని విడుదల చేశారు. అయితే విడుదల తేదీని ప్రకటించలేదు. ఏప్రిల్‌లో అని ప్రచారం సాగుతోంది. మరి ఈ చిత్రం అప్పుడే విడుదలవుతుందా లేక, అంతకంటే ముందే వస్తుందా అనేది చూడాలి.
చిరంజీవి - రామ్‌చరణ్ కథానాయకులుగా నటిస్తున్న ‘ఆచార్య’, ప్రభాస్ ‘రాధేశ్యామ్’ చిత్రాలు వేసవి రేస్‌లో ఉన్నాయి. ఇవి వస్తే యువ కథానాయకులు నటిస్తున్న మిగతా సినిమాలు మరోసారి వాయిదా వేసుకోక తప్పదు. ్య మరోపక్క పాన్ ఇండియా చిత్రం ‘కె.జి.ఎఫ్ 2’ ఈ వేసవిలోనే సందడి చేయనున్నట్టు సమాచారం.
ఈ వేసవి ఓకేనా?
కరోనాతోగతేడాది వేసవి సీజన్ తుడిచి పెట్టుకుపోయింది. 2021 సంక్రాంతి వరకూ తెలుగు సినిమా కోలుకోలేదు. ప్రస్తుతం 2021 వేసవిపై భారీ ఆశల్నే పెట్టుకుంది చిత్రసీమ. కరోనాతో విద్యా సంవత్సరంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఎప్పట్లా సెలవులు ఉండటం కష్టమే. పైగా అన్ని పరీక్షలూ మొదలుకానున్నాయి. ఈ నేపథ్యంలో బాక్స్ఫీసుకు వరంగా ఉన్న విద్యార్థులు ఏమాత్రం థియేటర్లకు వస్తారో వేచి చూడాలి.
‘రంగస్థలం’, ‘భరత్ అనే నేను’, ‘మహానటి’ తదితర చిత్రాలతో 2018 వేసవి తెలుగు బాక్సాఫీసుకి కాసుల వర్షం కురిపించింది. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయి ప్రభావం చూపించిన వేసవి రాలేదు. 2019లో ‘మజిలి’, ‘చిత్రలహరి’, ‘జెర్సీ’, ‘మహర్షి’, ‘ఏజెండ్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘బ్రోచేవారెవరురా’ చిత్రాలు ప్రభావం చూపించాయి. మళ్లీ 2018లాంటి వేసవి కోసం తెలుగు చిత్రసీమ ఎదురు చూస్తోంది.
మరిన్ని
కొత్త సినిమాలు
- ‘సొగసు చూడ తరమా’ ఫస్ట్‌లుక్
- ‘జాతి రత్నాలు’ గుర్తుండిపోయే సినిమా: విజయ్
-
నా జీవితంలో ఇది ఒక ఆణిముత్యం
- మంచి సందేశం ఇచ్చే చిత్రమే ‘శ్రీకారం’: చిరంజీవి
-
34 ఏళ్లకు.. అనుపమ్ టాలీవుడ్ ఎంట్రీ
గుసగుసలు
- ట్రైనర్‌ను తీసుకెళ్తోన్న బన్నీ..!
- సుదీప్తో సుజిత్?
- NTR30లో రీల్ లేడీ పొలిటిషియన్?
-
కమల్ సినిమాలో ప్రతినాయకుడిగా లారెన్స్?
- మహేశ్‌బాబు వీరాభిమానిగా నాగచైతన్య..!
రివ్యూ
ఇంటర్వ్యూ
- పవన్..నేనూ హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నాం!
- నేను నటిస్తుంటే కాజల్ భయపడేది: నవీన్‌చంద్ర
-
అతనొక అమాయక ‘జాతిరత్నం’: నాగ్ అశ్విన్
-
‘శ్రీకారం’ వాస్తవానికి దగ్గరగా ఉండే చిత్రం: నరేష్
- అందుకే సీరియల్స్‌లో నటించడం లేదు: సాగర్
కొత్త పాట గురూ
-
‘పాప ఓ పాప’ వచ్చేసింది..!
-
‘అరణ్య’ నుంచి అడవి గీతం
-
మహేష్ రిలీజ్ చేసిన ‘రంగ్‌దే’ సాంగ్!
-
పునీత్ ‘పాఠశాల..’ సాంగ్ విడుదల!
-
కబడ్డీ..కబడ్డీ..సీటీమార్!