విజయశాంతి రీఎంట్రీ.. పారితోషికం ఎంతంటే?
close
Published : 16/01/2020 17:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విజయశాంతి రీఎంట్రీ.. పారితోషికం ఎంతంటే?

హైదరాబాద్‌: లేడీ అమితాబ్‌ బచ్చన్‌ విజయశాంతి 13 ఏళ్ల విరామం తర్వాత ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం కోసం మళ్లీ మేకప్‌ వేసుకున్నారు. ఆమె రీఎంట్రీ అనడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మళ్లీ ఆమెను వెండితెరపై చూడొచ్చని అభిమానులు ఆనందపడ్డారు. దానికి తగ్గట్టే ఈ నెల 11న వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలోని ఆమె పవర్‌ఫుల్‌ పాత్ర అలరించింది. అయితే ఈ సినిమాలో నటించేందుకు విజయశాంతి తీసుకున్న పారితోషికంపై టాలీవుడ్‌లో పెద్ద టాక్‌ నడుస్తోంది. జీఎస్టీతో కలిపి ఆమె రూ.1.5 కోట్లు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఓ కథానాయిక తీసుకునే మొత్తానికంటే ఇది ఎక్కువని అంటున్నారు. మరి ఇందులో ఏ మాత్రం నిజం ఉందో తెలియాలంటే నిర్మాతలు స్పందించాల్సిందే.

ఇకపై నటనను కొనసాగించాలనే ఉద్దేశంలో విజయశాంతి ఉన్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ సాధారణ పాత్రల్లో నటించనని, పవర్‌ఫుల్‌ రోల్స్‌ వస్తేనే చేస్తానని తెలిపారు. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు నటించిన సంగతి తెలిసిందే. అనిల్‌ రావిపూడి దర్శకుడు. రష్మిక కథానాయిక. ఈ సినిమా మంచి టాక్‌ అందుకోవడంతోపాటు బాక్సాఫీసు వద్ద విశేషమైన వసూళ్లు రాబడుతోన్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని