ఆ సినిమాతో విజయ్‌ కుమారుడు ఎంట్రీ?
close
Updated : 25/04/2020 11:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ సినిమాతో విజయ్‌ కుమారుడు ఎంట్రీ?

చెన్నై: తమిళ నటుడు విజయ్‌ కుమారుడు జాసన్ సంజయ్‌ త్వరలో వెండితెరకు పరిచయం కానున్నారని కోలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది. చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌ కథానాయకుడిగా తెలుగుతెరకు పరిచయమవుతోన్న చిత్రం ‘ఉప్పెన’. బుచ్చిబాబు దర్శకుడు. కృతికాశెట్టి కథానాయిక. కోలీవుడ్‌ నటుడు విజయ్‌ సేతుపతి రాయనం అనే పాత్రలో నటిస్తున్నారు.

విజయ్‌ సేతుపతి ‘ఉప్పెన’ సినిమా కథను ‘మాస్టర్‌’ షూటింగ్ సమయంలో విజయ్‌తో చర్చించారట. విజయ్‌ సేతుపతి చెప్పిన ‘ఉప్పెన’ కథ విజయ్‌కు ఎంతగానో నచ్చిందట. అంతేకాకుండా తన కుమారుడు జాసన్‌ సంజయ్‌ను వెండితెరకు పరిచయం చేసేందుకు ఈ కథ చక్కగా సరిపోతుందని విజయ్‌ భావిస్తున్నారని కోలీవుడ్‌ టాక్‌. ప్రస్తుతం విజయ్‌ కుమారుడు జాసన్‌ సంజయ్‌ కెనడాలో ఫిల్మ్‌ మేకింగ్‌కు సంబంధించిన శిక్షణ తీసుకుంటున్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని