‘జాను’ తొలి పాట.. ఆకట్టుకుంటోన్న మెలొడీ..!
close
Published : 21/01/2020 17:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘జాను’ తొలి పాట.. ఆకట్టుకుంటోన్న మెలొడీ..!

‘ప్రాణం, నా ప్రాణం.. నీతో ఇలా..’

హైదరాబాద్‌: శర్వానంద్‌, సమంత జంటగా నటిస్తున్న ‘జాను’ సినిమా మొదటి పాట వచ్చేసింది. ‘ప్రాణం, నా ప్రాణం.. నీతో ఇలా.. గానం, తొలి గానం.. పాడే వేళ.. మన దూరమే అమావాస్యలే చెరో కథై ఇలా..’ అంటూ మెలోడీగా సాగిన గీతం శ్రోతల్ని ఆకట్టుకుంటోంది. చిన్మయి, గౌతమ్‌ భరద్వాజ్‌ ఈ పాటను ఆలపించారు. గోవింద్‌ వసంత సంగీతం సమకూర్చారు. ఈ వీడియోను సమంత సోషల్‌మీడియా వేదికగా షేర్‌ చేశారు.

తమిళ హిట్‌ ‘96’కి తెలుగు రీమేక్‌గా ఇది రూపొందుతోంది. సి. ప్రేమ్‌ కుమార్‌ దర్శకుడు. రాజు, శిరీష్‌ నిర్మాతలు. పాఠశాలలో ఇష్టపడ్డ జంట అనేక ఏళ్ల తర్వాత మళ్లీ కలిస్తే ఎలా ఉంటుందనే కథాంశంతో దీన్ని రూపొందించారు. తమిళ చిత్రం భారీ విజయం సాధించడంతో తెలుగు సినిమాపై మంచి అంచనాల నెలకొన్నాయి. విజయ్‌ సేతుపతి, త్రిష తమిళంలో నటించారు.

 




మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని