సుజీత్‌తో ‘లూసిఫర్’.. ఆ తర్వాత వీరితో..?
close
Updated : 20/04/2020 15:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సుజీత్‌తో ‘లూసిఫర్’.. ఆ తర్వాత వీరితో..?

వరుస సినిమాల గురించి చిరు

హైదరాబాద్‌: యువ దర్శకుడు సుజీత్‌తో కలిసి ‘లూసిఫర్‌’ సినిమా కోసం పనిచేసే ఆలోచనలో ఉన్నట్లు అగ్రకథానాయకుడు మెగాస్టార్‌ చిరంజీవి తెలిపారు. కరోనా వైరస్‌ను నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా వచ్చే నెల 3 వరకూ లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్స్‌ నిలిచిపోవడంతో సెలబ్రిటీలకు కూడా కుటుంబసభ్యులతో సరదాగా గడిపేందుకు సమయం దొరికింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ మీడియా ఛానెల్‌ వారు ప్రత్యేకంగా చిరంజీవిని ఫోన్‌లో ఇంటర్వ్యూ చేశారు.

ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాకి ఉన్న ఖ్యాతిని చూస్తుంటే తనకి ఎంతగానో సంతోషంగా అనిపిస్తోందని చిరు అన్నారు. రాజమౌళి వల్లే తెలుగు చిత్ర పరిశ్రమ ఇంతటి ఖ్యాతిని గడించిందని ఆయన తెలిపారు. అనంతరం చిరంజీవి తన తదుపరి ప్రాజెక్ట్‌ల గురించి చర్చించారు. ప్రస్తుతం కొరటాల శివతో సినిమా చేస్తున్నానని, అది అయ్యాక సుజీత్‌తో ‘లూఫిసర్‌’ చేసే ఆలోచనలో ఉన్నానని ఆయన తెలిపారు. అంతేకాకుండా యువ దర్శకుడు బాబీ, మెహర్‌ రమేశ్‌ తనకి కథలు చెప్పారని, అలాగే సుకుమార్‌, హరీశ్‌ శంకర్‌, పరశురాం కూడా తనతో పనిచేయాలనే ఆలోచనతో ఉన్నారని మెగాస్టార్‌ వెల్లడించారు.

ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ డైరెక్షన్‌లో ‘ఆచార్య’ సినిమా కోసం పనిచేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా కాజల్‌ సందడి చేయనున్నారు. కొణిదెల ప్రొడెక్షన్‌ పతాకం, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మణిశర్మ స్వరాలు అందిస్తున్నారు. కరోనా వైరస్‌ కారణంగా ‘ఆచార్య’ సినిమా షూటింగ్‌ను కొంతకాలంపాటు వాయిదా వేశారు. రామ్‌చరణ్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు.మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని