నం.1 విజయ్‌ దేవరకొండ  
close
Published : 18/03/2020 13:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నం.1 విజయ్‌ దేవరకొండ  

రామ్‌చరణ్‌ నం.2, ప్రభాస్‌ నం.4

హైదరాబాద్‌: ప్రముఖ మ్యాగజైన్‌ ‘హైదరాబాద్‌ టైమ్స్‌’ ప్రతి ఏడాదిలాగానే 2019 సంవత్సారానికి గాను ‘మోస్ట్‌ డిజైరబుల్‌ మెన్‌’ జాబితాను తాజాగా విడుదల చేసింది. ఆన్‌లైన్ ఓటింగ్‌ ప్రక్రియలో వచ్చిన ఫలితాలను ఆధారంగా చేసుకుని ఈ జాబితాను రూపొందించారు. ‘హైదరాబాద్‌ టైమ్స్‌ మోస్ట్‌ డిజైరబుల్‌ మెన్‌ 2019’ జాబితా ప్రకారం టాలీవుడ్‌ రౌడీ విజయ్ దేవరకొండ ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. విజయ్‌  2018లో కూడా ప్రథమ స్థానంలోనే ఉండడం విశేషం. ఈ ఏడాది విడుదలైన ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ చిత్రంతో ఆయన మిశ్రమ స్పందనలు అందుకున్నారు. 2018 ‘మోస్ట్‌ డిజైరబుల్‌ మెన్‌’ లిస్ట్‌లో మూడో స్థానంలో ఉన్న రామ్‌చరణ్‌ ఈ ఏడాది రెండో స్థానంలోకి వచ్చారు.

రామ్‌ పోతినేని

గతేడాది విడుదలైన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ చిత్రంతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు రామ్‌. ఈ సినిమాతో ఆయన ఒక్కసారిగా మాస్‌ ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. 2018 జాబితాలో 11వ స్థానంలో ఉన్న రామ్‌ పోతినేని ఈ ఏడాది ‘మోస్ట్‌ డిజైరబుల్‌ మెన్‌’ లిస్ట్‌లో మూడో స్థానానికి ఎగబాకారు.

ప్రభాస్‌

2017లో విడుదలైన ‘బాహుబలి-2’ తర్వాత ప్రభాస్‌.. గతేడాది విడుదలైన ‘సాహో’ చిత్రంలో నటించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా మిశ్రమ స్పందనలు అందుకుంది. 2018 జాబితాలో ఆయన రెండో స్థానంలో ఉండగా ఈ ఏడాది జాబితాలో ఆయన నాలుగో స్థానానికి పడిపోయారు.

సుధీర్‌

2018లో విడుదలైన ‘సమ్మోహనం’ చిత్రంతో మెప్పించిన సుధీర్‌బాబు ఆ ఏడాది జాబితాలో 14 స్థానంలో ఉండగా.. తాజా జాబితాలో మాత్రం 8 స్థానానికి ఎగబాకారు. ప్రస్తుతం ఆయన ‘వి’ సినిమాలో నటిస్తున్నారు.

అల్లు అర్జున్‌

ఈ ఏడాది విడుదలైన ‘అల..వైకుంఠపురములో..’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న అల్లు అర్జున్‌.. 2018 జాబితాలో 16 స్థానంలో ఉండగా.. తాజా జాబితాలో 12 స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

ఎన్టీఆర్‌

2018లో విడుదలైన ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రంలో నటించిన ఎన్టీఆర్‌.. ‘మోస్ట్‌ డిజైరబుల్‌ మెన్‌’ 2019 జాబితాలో 19వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. 2018 జాబితాలో 9వ స్థానంలో ఉన్న ఆయన ఈ స్థానానికి పడిపోయారు. ప్రస్తుతం ఆయన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలో నటిస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని