హైదరాబాద్‌ వీధుల్లో సరకులు పంచిన హీరో
close
Published : 08/04/2020 21:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హైదరాబాద్‌ వీధుల్లో సరకులు పంచిన హీరో

హైదరాబాద్‌: టాలీవుడ్‌ కథానాయకుడు సందీప్‌ కిషన్‌ హైదరాబాద్‌లోని పేద ప్రజలకు సరకులు పంపిణీ చేశారు. నిర్మాత అభిషేక్‌తో కలిసి నగరంలోని వివిధ ప్రాంతాల్లో సరకులతోపాటు మాస్కులు, శానిటైజర్లు పంచిపెట్టారు. అందరూ పరిశుభ్రత పాటించాలని, మాస్కుల్ని ధరించాలని ఈ సందర్భంగా సందీప్‌ కిషన్‌ సూచించారు.

కరోనా నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సినీ కార్మికుల్ని ఆదుకోవడానికి నిర్మాత గల్లా పద్మావతి ముందుకొచ్చారు. అమర్‌రాజా మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ తరఫున కరోనా క్రైసిస్‌ ఛారిటీ (సీసీసీ)కి రూ.10 లక్షలు విరాళంగా అందించారు. కరోనాతో పోరుకు నటుడు సాగర్‌ రూ.5 లక్షలు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి అందించారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌కు చెక్కు అందించారు. హీరో సాయికుమార్‌ సీసీసీకి ఐదు లక్షల నాలుగు రూపాయలు, డబ్బింగ్‌ యూనియన్‌కు రెండు లక్షల ఎనిమిది రూపాయలు విరాళంగా అందించారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని