లాక్‌డౌన్‌లో చాలా భయపడ్డా: రష్మిక
close
Published : 23/05/2020 21:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లాక్‌డౌన్‌లో చాలా భయపడ్డా: రష్మిక

హైదరాబాద్‌: అభద్రతా భావాల్ని పక్కనపెట్టి స్వేచ్ఛగా జీవించమని కథానాయిక రష్మిక అభిమానులకు సందేశం ఇచ్చారు. ప్రతి ఒక్క వ్యక్తికి ఈ ఫీలింగ్‌ ఉంటుందని, దాన్ని అధిగమించాలని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ చేశారు. ‘అభద్రతా భావానికి గూగుల్‌లో అర్థం వెతికితే... నమ్మకం కోల్పోవడం అని చూపిస్తోంది. కానీ నేను దానర్థం మనుషులని చెబుతా. మనమంతా మన గురించి లేదా ఇతరుల గురించి అభద్రతా భావంతో ఆలోచిస్తూనే ఉంటాం. చిన్న చిన్న విషయాల్ని కూడా పట్టించుకుంటూ భయపడుతుంటాం. ‘బ్రో.. నేను బరువు పెరిగానా?, సన్నగా ఉన్నానా? నా చర్మం పొడిబారిపోయిందా?, నా చర్మం జిడ్డుగా ఉందా?’ అని అడుగుతుంటాం. ఎవరైనా ‘నీ ముఖానికి ఏమైంది?’ అని ప్రశ్నిస్తే చాలు.. ఇక అంతా అయిపోయినట్లే. ఆ తర్వాత ఓ పది రోజులు దుప్పటి చాటునే ఉండిపోతాం. ఇలాంటి అభద్రతా భావాల గురించి ఆలోచిస్తూ ఎంతో సమయం వృథా చేస్తుంటాం’.

‘నిజంగా చెబుతున్నా.. ఈ లాక్‌డౌన్‌లో నేను చాలా అభద్రతగా ఫీలయ్యా. నా పని, నా మనసు, నా ఫిజిక్‌, నా మానసిక ఆరోగ్యం.. ఇలా ప్రతి దాని గురించి భయపడ్డా. కానీ ప్రతిదాన్ని మనం అదుపుచేయలేమని అర్థం చేసుకున్నా. అందుకే కనీసం సాధ్యమైనవి కంట్రోల్‌లో ఉంచేందుకు ప్రయత్నిద్దాం. మనలోని ది బెస్ట్‌ను బయటికి తీద్దాం’.

‘అసలు మీకంతా నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే.. అభద్రతా భావాన్ని, భయాన్ని మీ బలంగా మార్చుకోండి. ‘నీ శరీర రంగు నల్లగా ఉంది, నువ్వు సన్నగా ఉన్నావు, నీ కళ్లు పెద్దగా ఉన్నాయి’ అని ఎవరైనా అంటే ఫర్వాలేదు, ఫీల్‌ అవ్వొద్దు. మిమ్మల్ని మీరు నమ్మండి. ఇవన్నీ కేవలం తాత్కాలికమైనవి మాత్రమే..’ అని ఆమె పేర్కొన్నారు. రష్మిక ప్రస్తుతం ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్నారు. అల్లు అర్జున్‌-సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న సినిమా ఇది. శేషాచలం అడవులు, ఎర్రచందనం దొంగల నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం బన్నీ, రష్మిక కొత్త యాస నేర్చుకుంటున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని