గుళ్లో దళిత యువకుడు పూజ చేశాడని.. 
close
Published : 09/06/2020 02:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గుళ్లో దళిత యువకుడు పూజ చేశాడని.. 

ఆమ్రోహా: గుడిలో పూజలు చేశాడనే కోపంతో ఓ దళిత యువకుడిని కాల్చి చంపిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లా దోమ్‌ఖేడా గ్రామంలో చోటు చేసుకుంది. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో నలుగురు దుండగులు వికాస్‌ జాదవ్‌ అనే యువకుడి ఇంట్లో చొరబడి దారుణంగా కాల్చిచంపారు. ఈ దారుణంపై మృతుడు తండ్రి మాట్లాడుతూ.. ‘మార్చి 31న కొంత మంది యువకులు నా కొడుకు గుళ్లో ప్రవేశించడాన్ని అడ్డుకున్నారు. వాళ్లు అలా ఎందుకు ప్రవర్తించారో తెలియదు. ఇలా గతంలో ఎప్పుడూ మాకు జరగలేదు. అనంతరం కులం పేరుతో దూషిస్తూ నా కొడుకుపై చేయిచేసుకున్నారు. కొంత మంది స్థానికులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది’ అని మృతుడి తండ్రి ఓం ప్రకాశ్‌ జాదవ్‌ తెలిపారు. అప్పుడు జరిగిన గొడవ గురించి పోలీసులకు సమాచారం ఇచ్చినా వారిపై ఎటువంటి చర్య తీసుకోలేదని ఆయన వాపోయారు. ‘శనివారం రాత్రి హోరామ్‌ చౌహాన్‌, లాలా చౌహాన్‌తోపాటు మరో ఇద్దరు యువకులు మా ఇంట్లోకి చొరబడ్డారు. నిద్రపోతున్న నా కుమారుడిని కాల్చేశారు. మమ్మల్ని బెదిరించి పరారయ్యారని’ ఓం ప్రకాశ్‌ వెల్లడించారు.

హత్య జరిగిన విషయం తెలిసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయంపై ఆమ్రోహా ఎస్పీ విపిన్‌ టాడా మాట్లాడుతూ మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం ఆధారంగా నలుగురు యువకులపై కేసు నమోదు చేశామన్నారు. మృతదేహాన్ని శవపరీక్షకు పంపామని, దర్యాప్తు కొనసాగుతోందని ఎస్పీ పేర్కొన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని