వృక్షాలతో మాస్క్‌లు
close
Updated : 28/10/2020 05:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వృక్షాలతో మాస్క్‌లు

సైన్స్‌

కరోనా కాలంలో ఎన్‌95 మాస్కులకు ఎక్కడలేని గిరాకీ పెరగటం తెలిసిందే. వైరస్‌ శరీరంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవటంలో ఇవి ఎంతగానో తోడ్పడతాయి. వీటిని మరింత సమర్థంగా పనిచేసేలా తీర్చిదిద్దితే? అదీ తేలికైన పద్ధతిలోనే అయితే? అలాంటి సరికొత్త ప్రక్రియనే రూపొందించారు రట్‌జెర్స్‌ యూనివర్సిటీ పరిశోధకులు. పునర్వినియోగించుకోవటానికి వీలైన, వృక్షాల నుంచి సేకరించిన మిథైల్‌సెల్యులోజ్‌ అనే పాస్టిక్‌ పదార్థాన్ని వినూత్నంగా వాడుకునేలా తీర్చిదిద్దటం ఇందులోని కీలకాంశం. దీన్ని 3డీ వస్తువుల మీద పిచికారీ చేస్తే నానో తీగల మాదిరిగా మారిపోతుండటం విశేషం. ఉదాహరణకు- ఎన్‌95 మాస్కుల లోపల పిచికారీ చేస్తే సన్నటి జల్లెడలా అంటుకుపోతుంది. ఇది గాలిని మరింత బాగా వడకట్టి, వైరస్‌లను సమర్థంగా అడ్డుకుంటుంది. మెత్తటి పదార్థంతో తయారుచేసే ఇలాంటి నానో తీగలను ఊపిరితిత్తులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసే సూక్ష్మకేశనాళికల మాదిరిగా, బల్లిలా గోడ మీద గట్టిగా పట్టుకొని ఉండటానికి తోడ్పడే సన్నటి వెంట్రుకల మాదిరిగా.. చాలా రకరకాలుగా వాడుకోవచ్ఛు యాంత్రికశక్తిని విద్యుత్‌శక్తిగా మార్చే చిన్న చిన్న జెనరేటర్ల తయారీకీ ఉపయోగించుకోవచ్ఛు ఉదాహరణకు- షూ మీద ఇలాంటి జెనరేటర్లను అంటించామనుకోండి. నడుస్తున్నప్పుడు విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. దీంతో సెల్‌ఫోన్‌ను ఛార్జ్‌ చేసుకోవచ్ఛు నిజానికి నానో తీగల తయారీ కొత్తదేమీ కాదు. మనం తినే పీచు మిఠాయి ఒకరకంగా ఇలాంటిదే! ఆయా పదార్థాలను ఒక వేగంతో గుండ్రంగా తిప్పటం ద్వారా ప్రస్తుతం నానో తీగలను తయారుచేస్తున్నారు. తిప్పటానికి బదులు పిచికారీ చేయగలిగితే మరింత తేలికగా వీటిని తయారుచేయొచ్ఛు ఇందుకు అవసరమైన ప్రాథమిక భౌతిక సూత్రాలను రట్‌జెర్స్‌ యూనివర్సిటీ పరిశోధకులు తాజాగా ఆవిష్కరించారు. దీని ఆధారంగానే మిథైల్‌సెల్యులోజ్‌తో అతి సూక్ష్మ ‘అడవుల’ను, నానోతీగల నురగలను సృష్టించారు. ఇది 3డీ వస్తువుల మీద పూతగా పూయటానికి అనువుగానూ ఉంటుంది. కాంతి కిరణాలను విద్యుత్‌ సంకేతాలుగా మార్చే ఆప్టికల్‌ సెన్సింగ్‌, రంగుల కోసం ఈ తీగల్లో బంగారం నానో అణువులనూ జోడించే అవకాశమూ ఉంది. సహజ గుణాలతో కూడిన అవయవాలను 3డీ పద్ధతిలో రూపొందించటంలో ఇది తొలి అడుగు కాగలదని పరిశోధకులు భావిస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని