కురులకు కరివేపాకు!
close
Published : 01/04/2021 00:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కురులకు కరివేపాకు!

అన్నం తినేటప్పుడు కూరలో, చారులో కరివేపాకు వస్తే తీసి పక్కన పెడతాం. అయితే ఈ ఆకులను తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. కేవలం తినడమే కాదు వీటితో చేసిన పేస్ట్‌ను జుట్టుకు పూతలా వేసుకుంటే, కొబ్బరినూనెతో కలిపి రాసుకుంటే బోలెడు లాభాలున్నాయి. అవేంటో చూసేద్దామా...

కరివేపాకు నూనె.. కొబ్బరినూనెలో కరివేపాకు కలిపి వాడితే జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా ఎదగడమే కాకుండా రాలడం తగ్గుతుంది. అర కప్పు కొబ్బరినూనెలో గుప్పెడు కరివేపాకులను వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత నూనెను చల్లార్చి సీసాలోకి వడకట్టుకోవాలి. ఈ నూనెను జుట్టుకు పట్టించి గంట తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపుతో కడిగేయాలి. వారంలో ఒకట్రెండుసార్లు ఇలా చేస్తే వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయి.

లాభాలు...

* ఈ నూనెతో మర్దనా చేయడం వల్ల మాడుకు రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. ఇది జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది.
* ఈ నూనె జుట్టు నెరుపును తగ్గిస్తుంది. అలాగే చిట్లడాన్నీ నియంత్రిస్తుంది. పోషణతోపాటు నిగారింపునూ ఇస్తుంది.

జుట్టుకు పూత!

గుప్పెడు కరివేపాకుల్లో రెండు వెల్లుల్లి పాయలు, రెండు చెంచాల పెరుగును కలిపి మెత్తగా చేయాలి. ఈ మిశ్రమాన్ని మాడు, జుట్టుకు పట్టించాలి. అరగంట తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపుతో కడిగేయాలి. వారానికోసారి ఈ ప్యాక్‌ను ప్రయత్నిస్తే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.

ఈ ప్యాక్‌తో లాభాలు..

* పెరుగు.. తలలోని మృతకణాలు, చుండ్రును తొలగిస్తుంది. దాంతో మాడు శుభ్రంగా, ఆరోగ్యంగా మారుతుంది.
* కరివేపాకు మాడుపై ఉన్న మలినాలను తొలగించి జుట్టు కుదుళ్లకు బలం చేకూరుస్తుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని