‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి మరో సర్‌ప్రైజ్‌ - i cant wait to show all of how rrr designed my character ajay devagn
close
Published : 30/03/2021 13:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి మరో సర్‌ప్రైజ్‌

ఇంటర్నెట్‌ డెస్క్: దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లు కథానాయకులుగా నటిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు.  ఈ చిత్రంలో అజయ్‌ దేవగణ్‌ ఫస్ట్ లుక్‌ మోషన్‌ పోస్టర్‌ని ఏప్రిల్‌ 2న విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా నటుడు అజయ్‌ ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ..‘‘ఈ చిత్రం నాకొక ఉత్తేజకరమైన అనుభవాన్నిచ్చింది. ఇందులో రాజమౌళి సృష్టించిన నా పాత్రను మీకు పరిచయం చేసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అంటూ వెల్లడించారు.

గతంలో ఎన్నడూ కనిపించని విధంగా అజయ్‌ ఇందులో కనిపించనున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మితమవుతోన్న చిత్రంలో ఎన్టీఆర్‌ కొమరం భీంగా రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. అలియా భట్‌ సీత పాత్రలో నటిస్తోంది. కీరవాణి సంగీత స్వరాలు స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్‌ 13 తెరపైకి రానుంది.   
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని