ING: ‘తప్పు చేస్తే దేవుడు చంపేస్తాడు’ - in the name of god trailer out now
close
Published : 12/06/2021 12:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ING: ‘తప్పు చేస్తే దేవుడు చంపేస్తాడు’

ఆకట్టుకునేలా ‘ఇన్‌ ది నేమ్‌ ఆఫ్‌ గాడ్‌’ ట్రైలర్‌

హైదరాబాద్‌: ప్రియదర్శి, నందినిరాయ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఇన్‌ ది నేమ్‌ ఆఫ్‌ గాడ్‌’. విద్యాసాగర్‌ ముత్తుకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్‌ 18న ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ ‘ఆహా’ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం ‘ఐఎన్‌జీ’ ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

‘అరెయ్‌.. నీకు సైతాన్‌కి, దేవుడికి ఉన్న తేడా ఏంటో తెలుసా! సైతాన్‌ నీలో ఉన్న కోరికను రెచ్చగొట్టి.. నువ్వు తప్పు చేసేలా చేసి.. నువ్వు కష్టపడుతుంటే చూసి ఆనందిస్తాడురా. కానీ దేవుడు అలా కాదు.. చాలా సింపుల్‌. నువ్వు తప్పు చేసినప్పుడే చంపేస్తాడు’ అంటూ ప్రియదర్శి చెప్పే మాటలతో ప్రారంభమైన ట్రైలర్‌ ఆకట్టుకునేలా సాగింది. ప్రియదర్శి, పోసాని, నందినిరాయ్‌ల నటన ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. క్రైమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్‌ చూస్తే తెలిసిపోతుంది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని