ధనుష్‌ సరసన కృతి శెట్టి? - krithi shetty in dhanush next with balaji mohan
close
Published : 14/04/2021 23:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ధనుష్‌ సరసన కృతి శెట్టి?

ఇంటర్నెట్‌ డెస్క్: ‘రఘువరన్‌ బీటెక్‌’ నటుడు ధనుష్‌, బాలాజీ మోహన్‌ దర్వకత్వంలో ఓ సినిమా చేయనున్నాడని సమాచారం. వీరి కాంబినేషన్లో ఇప్పటికే ‘మారి’, ‘మారి2’ చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మూడో సినిమాకి సైతం కథను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో కథానాయికగా ‘ఉప్పెన’ ఫేమ్‌ కృతి శెట్టి పేరును నిర్మాణ సంస్థ పరిశీలిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ధనుష్‌ చిత్రంతో కోలీవుడ్‌లో కృతి శెట్టి అడుగుపెడుతుందో లేదో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే. ఇప్పటికే కృతికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. తమిళ అభిమానులు సైతం ఆమె అందానికి ఫిదా అయ్యారట. కృతి ప్రస్తుతం నానితో కలిసి ‘శ్యామ్‌ సింగరాయ్‌’లో చేస్తోంది. ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో సుధీర్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’లోనూ కథానాయికగా నటిస్తోంది.  
 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని