వావ్‌! ఈమె డ్యాన్స్‌ అద్భుతం: మాధురీ దీక్షిత్‌ - madhuri dixits high praise for girl dancing in village watch video
close
Published : 09/02/2021 02:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వావ్‌! ఈమె డ్యాన్స్‌ అద్భుతం: మాధురీ దీక్షిత్‌

న్యూదిల్లీ: ప్రస్తుతమున్న సోషల్‌ మీడియా ప్రభంజనంతో ఎంతోమంది మట్టిలో మాణిక్యాలు వెలుగులోకి వస్తున్నారు. తాజాగా నటి మాధురీ దీక్షిత్‌ ఒక పల్లెటూరి యువతి నృత్యం చేస్తున్న వీడియోను  ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఆ పోస్టుకు ‘వావ్‌! ఆమె అద్భుతంగా డ్యాన్స్‌ చేస్తోంది. ఇలాంటి ప్రతిభను ఇంకా మనం వెలికి తీయాల్సిఉంది’ అంటూ రాసుకొచ్చారు.  1957లో వచ్చిన హిట్‌ చిత్రం ‘మదర్‌ ఇండియా’లోని గోగత్‌ నహీన్‌..అనే పాటకు ఆ యువతి అద్భుతంగా నృత్యం చేసింది. సుమారు 2 నిమిషాలకు పైగా ఉన్న ఆ వీడియోలో ఆమె ఎక్కడా తడబడకుండా నాటి హీరోయిన్లవలె చక్కనైన ముఖకవళికలతో అలరించింది. ఆ యువతి వివరాలు తెలియరాలేదు కానీ,  వీడియోను మొదట ‘రాగిరీ’ అనే ఒక ఎన్జీవో షేర్‌ చేసింది. నాటి తారలు మాధురీ దీక్షిత్‌, హేమమాలినీలను ఆ ట్వీట్‌కు  ట్యాగ్‌ చేస్తూ యువతి నృత్యంపై వారి అభిప్రాయాలు తెలపాల్సిందిగా కోరారు. ‘రాగిరీ’ సంస్థవారు సంప్రదాయ సంగీతాన్ని, నృత్యాన్ని ప్రమోట్‌ చేస్తూ ఉంటారు. మరి ఆకట్టుకుంటున్న ఆ యువతి నృత్యాన్ని మీరూ చూసేయండి!

ఇవీ చదవండి!

ప్రకృతి కోపానికి నిదర్శనమిది

అనసూయ @ అర డజను చిత్రాలు
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని