అతిథిగా నాగార్జున.. వంట చేసిన మెగాస్టార్‌  - megastar chiranjeevi prepared food for nagarjuna
close
Published : 02/04/2021 06:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అతిథిగా నాగార్జున.. వంట చేసిన మెగాస్టార్‌ 

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ కథానాయకుడు అక్కినేని నాగార్జున నటించిన చిత్రం ‘వైల్డ్‌ డాగ్‌’. ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు ప్రచార కార్యక్రమాలతో విరామం లేకుండా గడిపిన నాగార్జున.. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి ఇంటికి వెళ్లారు. దీంతో చిరంజీవి అతిథి నాగార్జున కోసం స్వయంగా ఓ కమ్మని వంట చేశాడు. దీనికి సంబంధించి నాగార్జున ట్విటర్‌లో చిరంజీవితో కలిసి ఉన్న ఫొటోను షేర్‌ చేశాడు.

‘‘వైల్డ్‌ డాగ్‌’ విడుదల నేపథ్యంలో నా ఒత్తిడి తగ్గించేందుకు మెగాస్టార్‌ స్వయంగా  వంటచేశారు. నాకోసం రుచికరమైన విందుని ఏర్పాటు చేశారు. ఈ సాయంత్రం అద్భుతంగా గడిచింది. ధన్యవాదాలు’’ అంటూ నాగార్జున ట్వీట్‌ చేశారు. ఈ దృశ్యాన్ని చిరంజీవి సతీమణి సురేఖ ఫొటో తీసినట్లు నాగార్జున తెలిపారు. 

మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిరంజన్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సయామీఖేర్‌, అలీ రెజా, ఆర్యా పండిట్‌, కాలెబ్‌ మాథ్యూస్‌ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందించారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని